Friday, April 26, 2024
- Advertisement -

ఇక నుంచి కరెంట్ “షాక్ “లు తప్పవా ?

- Advertisement -

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అప్పుల చిట్టా ఏ స్థాయిలో ఉందో ఆ మద్య కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ రెండు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా చెల్లించాల్సిన బకాయిల విషయంలో కేంద్రం ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంది. అయినప్పటికి ఆయా రాష్ట్రాలు పెడచెవిన పెడుతూ వచ్చాయి. ఇక తాజాగా చెల్లించాల్సిన బకాయిల విషయంలో ఏపీ, తెలంగాణతో పాటు మరో 13 రాష్ట్రాలకు కేంద్రం షాక్ ఇచ్చింది.

గురువారం నుంచి ఈ 13 రాష్ట్రాలు ఇండియన్ ఎలక్ట్రిసిటి ఎక్స్ఛేంజ్ ద్వారా విద్యుత్ కొనుగోలు చేయకుండా నిషేధం విధించింది. ఈ ఎక్స్ఛేంజ్ ద్వారా రాష్ట్రాల్లో ఉండే విద్యుత్ కంపెనీలు విద్యుత్ ను కొనడం లేదా అమ్మడం చేస్తూ ఉంటాయి. రాష్ట్రాలకు అత్యవసర సమయాల్లో ఎక్కువగా ఈ ఎక్స్ఛేంజ్ ద్వారానే విద్యుత్ కొనుగోలు జరుగుతూ ఉంటుంది. అయితే కేంద్రం తాజా నిర్ణయంతో ఈ ఎక్స్ఛేంజ్ ద్వారా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు విద్యుత్ కొనుగులు చేయడం జరగదు. ఇండియన్ ఎలక్ట్రిసిటీ ఎక్స్ఛేంజ్ (ఐ‌ఈ‌ఎక్స్) కు తెలంగాణ రూ.1380 కోట్లు, ఆంధ్ర ప్రదేశ్ రూ.412 కోట్లు బకాయి ఉన్నట్లు తెలుస్తోంది.

ఇంకా రాజస్తాన్ 500 కోట్లు, తమిళ నాడు 924 కోట్లు మహారాష్ట్ర 381 కోట్లు.. ఇలా ఆయా రాష్ట్రాలు అప్పుగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎక్స్ఛేంజ్ ద్వారా విద్యుత్ సరఫరా నిలిచిపోయిన పెద్దగా నష్టం వాటిల్లే అవకాశం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చాలా రాష్ట్రాలకు సరిపడా విద్యుత్ సరఫరా సొంత ప్లాంట్ల నుంచే తయారవుతుంది. అలాగే ప్రైవేట్ కంపెనీల ద్వారా కూడా విద్యుత్ సరఫరా జరుగుతుంది. చాలా రాష్ట్రాలకు నష్టం జరిగే అవకాశం లేదు. అయితే విద్యుత్ ఉత్పత్తి తక్కువగా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం నిర్ణయంతో తలనొప్పి ఏర్పడే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -