Thursday, April 25, 2024
- Advertisement -

ఎమ్మెల్సీ కవిత అక్క.. నిజంగానే అక్కగా మారిపోయింది..!

- Advertisement -

ఎమ్మెల్సీ కవిత మరోసారి తన‌ సేవాగుణాన్ని చాటుకున్నారు. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఓ నిరుపేద మహిళలకు భరోసానిచ్చారు. చైనా రుణ యాప్ నిర్వాహకుల వేధింపులకు బలైన కుటుంబానికి ఆమె బాసటగా నిలిచారు. ముగ్గురు కుమార్తెలను ఉన్నత చదువులు చదివించే బాధ్యతను తాను తీసుకుంటానని మృతుని భార్యకు హామీ ఇచ్చారు. ఏ సమస్య వచ్చినా వెంటనే తనను సంప్రదించాలని కవిత సూచించారు.

మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లికి చెందిన చంద్రమోహన్ బలవన్మరణానికి పాల్పడ్డారు. రుణ యాప్ నుంచి తీసుకున్న అప్పు కంటే ఆరు రెట్లు అధికంగా చెల్లించినా వేధింపులకు గురి చేయడం వల్ల చేసేది లేక ఆత్మహత్య చేసుకున్నారు. చివరకు ఆయన భార్య సరిత, ముగ్గురు ఆడపిల్లలు రోడ్డున పడ్డారు.

విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత ఆ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సరిత, ఆమె ముగ్గురు పిల్లలు కవితను హైదరాబాద్​లో కలిశారు. అండగా ఉంటానని హామీ ఇచ్చిన కవితకు సరిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

పుదుచ్చేరిలో.. వారసత్వ రాజకీయాల పై షా ప్రకంపన..!

డేనైట్ టెస్టులపై బీసీసీఐ పునరాలోచనలో పడిందా?

పెట్రోల్ ధ‌ర‌లు అందుకే పెరుగుతున్నయ్: కేంద్ర మంత్రి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -