Wednesday, April 24, 2024
- Advertisement -

కొత్త ఫీచర్‌తో వస్తున్న వాట్సాప్!

- Advertisement -

వాట్సాప్‌ ఈ పేరు తెలియని వారు ఉండరు. ఫోన్‌ మాట్లాడే వారికంటే వాట్సప్‌లో చాటింగ్‌ చేసుకునే వారి సంఖ్యే అధికంగా ఉంది. ఈ యాప్‌లో ఫ్రెండ్స్, రిలేటీవ్స్ ఇలా ఎవ్వరైనా గ్రూప్‌లు క్రియేట్‌ చేసుకొని యోగ క్షేమాలు తెలుసుకోవచ్చు. ఐతే ఈ యాప్‌ల వల్ల చాలా అనార్థాలు సైతం ఉన్నాయి. ఇప్పుడు ఈ యాప్‌ కొత్త ఫీచర్‌తో వస్తుంది.

వాట్సాప్‌లో ఫ్రెండ్స్, రిలేటీవ్స్‌, కొలిక్స్‌ ఇలా కొందరు వాట్సాప్‌ గ్రూప్‌లో అసభ్య మెసేజస్‌లు పెడుతుంటారు. అలా వచ్చిన మెసేజ్‌ వల్ల గ్రూప్‌ అడ్మిన్‌లకు తననొప్పి తెచ్చి పెడుతోంది. గ్రూప్‌లో ఉన్న ఎవ్వరైనా పోరపాటున తప్పుడు మెసేజ్ పెడుతే షేర్‌ చేసిన వ్యక్తి మాత్రమే ఆల్‌ డిలిట్‌ చేయగలగుతారు. వాట్సాప్‌ గ్రూపులో వచ్చిన తప్పుడు వార్తలను గ్రూప్‌లో ఉన్న వారందరూ చూస్తారు. తప్పుడు మేసేజ్‌లైతే వాటి వల్ల ఘర్షణలు, పోలీస్‌ కేసులు అయ్యిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కేసులైతే అది ముందు ఆ గ్రూప్‌ అడ్మిన్‌ను అరెస్టు చేస్తారు.

ప్రస్తుతం వాట్సాప్‌ కొత్త ఫీచర్‌తో వచ్చింది. ఈ ఫీచర్‌ గ్రూప్‌ అడ్మిన్‌ల తల నొప్పిని తొలగించేందుకు ఉపయోగ పడుతోంది. ఈ కొత్త ఫీచర్‌ గ్రూప్‌లో ఎవ్వరైనా తప్పుడు మెసేజ్‌లు పెడుతే గ్రూప్‌ అడ్మిన్‌లు ఆ మెసేజ్‌లను గ్రూప్‌లో నుంచి తీసివేసే విధంగా వాట్సాప్‌ ముందుకు వస్తుంది. దీంతో ఎలాంటి మెసేజ్‌లు వచ్చినా పోస్టు పెట్టిన వ్యక్తే కాకుండా ఆ గ్రూప్‌ అడ్మిన్‌ సైతం మెసేజ్‌లను డిలిట్‌ చేయవచ్చు.

తెలంగాణలోకి ప్రవేశించిన ఒమైక్రాన్‌

ఒమైక్రాన్‌ టీకాలు లభించేనా ?

డబ్బులు ఇస్తేనే డోర్లు ఓపెన్‌ చేస్తాం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -