Sunday, May 26, 2024
- Advertisement -

ఇస్రో మ‌రో ఘ‌న‌త‌.. నింగిలోకి హైసిన్ శాటిలైట్‌

- Advertisement -

భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ ఇస్రో మ‌రో ఘ‌న‌త‌ను సాధించింది. పీఎస్‌ఎల్‌వీ సీ-43 రాకెట్ ప్ర‌యోగం విజ‌య‌వంతం అయ్యింది. దీని ద్వారా ఒకే సారి 30 ఉప గ్ర‌హాల‌ను నింగిలోకి పంపింది. సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం మొదటి లాంచ్‌ ప్యాడ్‌ నుంచి ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది.

ఒక స్వదేశీ ఉపగ్రహంతోపాటు అమెరికా, కెనడా, కొలంబియా, మలేషియా తదితర దేశాలకు చెందిన 30 ఉపగ్రహాలను ఈ రాకెట్ ద్వారా పంపారు. పీఎస్ఎల్వీ ద్వారా నాలుగు దశల్లో ఈ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ప్రయోగానికి సంబంధించి బుధవారం ఉదయం 5.59 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 28 గంటలపాటు నిరంతరాయంగా కొనసాగిన అనంతరం రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.

ఇవాళ ఉదయం 9.58 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (ఎస్డీఎస్సీ-షార్) మొదటి ప్రయోగ కేంద్రం నుంచి ఈ రాకెట్‌ను ప్ర‌యోగించారు. పీఎస్‌ఎల్వీ-సీ43 మిషన్‌లో ప్రధాన ఉపగ్రహం అయిన హైసిస్‌ను ఇస్రో అభివృద్ధి చేసింది. 380 కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహాన్ని.. భూమికి 636 కి.మీ. ఎత్తులో ఉన్న పోలార్ సన్ సింక్రొనస్ ఆర్బిట్‌లో 97.957 డిగ్రీల ఒంపు వద్ద ప్రవేశపెడతారు. ఈ మిషన్ జీవితకాలం ఐదేండ్లు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -