Monday, April 29, 2024
- Advertisement -

బ్యాంకుల దగ్గర క్యూ లు తగ్గాయి 

- Advertisement -
Public queues getting shorter in Banks and ATMs

మొదటి మూడు నాలుగు రోజులు భారీ ఎత్తున క్యూలు బ్యాంకుల ఎదుట దర్శనమిచ్చాయి. ఏటీఎం సెంటర్లు అయితే.. చెప్పాల్సిన అవసరమేలేదు. పగలు.. రాత్రి అన్న తేడా లేకుండా ఏటీఎం సెంటర్లు జనంతో పోటెత్తాయి. గంటల తరబడి క్యూలైన్లో నిలుచోవటంపై సామాన్యులు చిరాకును.. ఆగ్రహాన్ని ప్రదర్శించారు.

నోట్ల కొరత భారీగా ఉండటం.. రూ.500 నోట్లను ఆలస్యంగా విడుదల చేయటం.. ఇప్పటికీ అవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవటంతో చిల్లర నోట్ల కోసం ప్రజలు తీవ్రంగా అవస్థలు పడాల్సిన పరిస్థితి.

ఇదిలా ఉంటే.. నోట్ల రద్దు తర్వాత శని..ఆదివారాల్లో ప్రజలు తమ మిగిలిన పనుల్ని వదిలేసి.. బ్యాంకుల ముందు బారులు తీరటం కనిపించింది. ఈ సందర్భంగా నోట్ల రద్దుపై ప్రధాని తీసుకున్న నిర్ణయంపై కొందరు ప్రజలు తీవ్ర ఆగ్రహాన్నివ్యక్తం చేశారు. దీంతో.. విపక్షాలు ప్రధాని తీసుకున్ననిర్ణయాన్ని తప్పు పడుతూ గళం విప్పాయి. ఇదిలా ఉంటే.. మంగళవారంతో పోలిస్తే.. బుధవారం తొలిసారి బ్యాంకుల వద్ద క్యూలైన్లు తగ్గుముఖం పట్టటం గమనార్హం. జాతీయ బ్యాంకులతో పోలిస్తే.. ప్రైవేటు బ్యాంకుల వద్ద క్యూలైన్లలో దాదాపు యాభై శాతం మార్పులు వచ్చినట్లుగా బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -