Monday, April 29, 2024
- Advertisement -

దార్శనికుడు.. పీవీ

- Advertisement -

దేశాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించి.. ఇప్పుడు ప్రపంచ పటంలో బలమైన శక్తిగా నిలబడేందుకు కారణమైన నాయకుల్లో.. మన తెలుగువాడు.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఒకరు. ఇవాళ ఆ మహానాయకుడి జయంతి సందర్భంగా.. తెలుగు జాతి.. పీవీ సేవలను గుర్తు చేసుకుంటోంది. రాజకీయ నాయకుడిగానే కాదు.. బహుభాషా కోవిదుడుగా.. సాహిత్యంపై అభిలాష ఉన్న కళా పోషకుడిగా.. క్లిష్ట పరిస్థితులను తన మేధో సంపత్తితో సులువుగా పరిష్కరించే అసాధ్యుడిగా కూడా పీవీ గుర్తింపు తెచ్చుకున్నారు.

1991లో రాజీవ్ గాంధీ మరణం తర్వాత.. ప్రభుత్వ పగ్గాలను ఎవరూ తీసుకోలేని దశలో.. పీవీ నరసింహారావు తెరపైకి వచ్చారు. ఆయనను ముందు నిలిపి.. తెర వెనక తమ పనులు చేసుకునేందుకు చాలా మంది అప్పటి కాంగ్రెస్ జాతీయ నాయకులు ప్రయత్నించారన్న ప్రచారం ఉంది. కానీ.. అలాంటి చర్యలను ఒక్కొక్కటిగా ఎదుర్కొంటూ.. ప్రభుత్వాన్ని.. దేశాన్ని ముందుకు నడిపిన పీవీ.. రాజకీయాల్లో ప్రత్యేకంగా నిలిచారు.

ఆర్థిక సంస్కరణలతో దేశం గతినే మర్చేసేందుకు నడుం కట్టి.. మన్మోహన్ ను ఆర్థిక మంత్రిని చేశారు. ఈ నిర్ణయంలో తోటి నాయకులే పీవీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ.. ఆర్థిక వేత్తగా మన్మోహన్ సామర్థ్యాన్ని గుర్తించిన పీవీ.. ఆయనతో కలిసి సంస్కరణలు అమలు చేశారు. దేశంలో పెట్టుబడులకు తలుపులు తెరిచారు. అన్ని వర్గాల సంక్షేమానికి చర్యలు తీసుకున్నారు. తన ప్రభుత్వానికి పార్లమెంట్ లో సంపూర్ణ మద్దతు లేకపోయినా.. అందరినీ సమన్వయ పరుస్తూ.. ఐదేళ్ల పాటు ఇబ్బంది లేకుండా పరిపాలన కొనసాగించారు.

ఇంత చేసినా.. తనకంటూ ప్రత్యేక కోటరీ ఏర్పాటు చేసుకోడంపై దృష్టి పెట్టలేదు. ఇదే.. ఆయనకు కాంగ్రెస్ ముఖ్య నాయకులతో పాటు. గాంధీ కుటుంబంతో అంతగా సంబంధాలు లేకుండా చేసింది. గాంధీ కుటుంబానికి సంబంధం లేని ఓ వ్యక్తి.. ఐదేళ్ల పాటు.. కాంగ్రెస్ నుంచి ప్రధాన మంత్రిగా పని చేసిన ఘనత మాత్రం దక్కింది. అయితే.. 1996 ఎన్నికల్లో పరాజయం తర్వాత.. పార్టీకి పీవీకి మరింత దూరం పెరిగింది. చివరికి ఆయన చనిపోయాక కాంగ్రెస్ కార్యాలయంలో నివాళి కూడా అర్పించలేని పరిస్థితి ఏర్పడింది.

కానీ.. పీవీ చేసిన సేవే.. ఆయన్ను ప్రజా నాయకుడిగా.. దేశంలో నిలబెట్టింది. ఆయన తీసుకున్న నిర్ణయాలే.. దేశ ఆర్థిక పరిపుష్టికి కారణంగా నిలిచాయన్న విషయాన్ని.. దేశం కూడా అర్థం చేసుకుంటోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -