Sunday, April 28, 2024
- Advertisement -

జమ్మూ,కాశ్మీర్ లో ముగిసన ఎన్ కౌంటర్…ముగ్గురు తీవ్రవాదులు హతం

- Advertisement -

పుల్వామా దాడి ఘటన తర్వాత మరోసారి జమ్మూకశ్మీర్ లో ఉగ్ర కలకలం రేగింది. ఉగ్రవాదులు జరిపిన కాల్పులను సైన్యం తిప్పికొట్టింది. ఆర్మీ జరిపిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులతో పాటు ఒక జవాన్ మరణించారు. మరణించిన ఉగ్రవాదుల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఒసామా కూడా ఉండటం గమనార్హం.

దాదాపు 12 గంటల పాటు సాగిన ఆపరేషన్‌లో ఉగ్రవాదుల చేతిలో బంధీలుగా ఉన్నవారిని సురక్షితంగా విడిపించారు.అయితే ఈ ఆపరేషన్‌లో ఒక భారత జవాన్ అమరుడవగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. రాంబన్ ఆపరేషన్ సక్సెస్ కావడంతో జవాన్లు విజయ నినాదాలు చేశారు.

ఉదయం మొదట, ఉగ్రవాదులు ఓ పౌర వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా, వాహనంలో ఉన్న వ్యక్తి వాహనం ఆపకుండా వేగంగా వెళ్లిపోయాడు. ఈ ఘటనపై భద్రతా బలగాలకు సమాచారం అందించాడు.దీంతో బటోటే ప్రాంతంలో జవాన్లు భారీగా మోహరించారు. ఆ సమయంలో క్విక్ రియాక్షన్ టీమ్‌పై గ్రెనేడ్ దాడికి యత్నించగా.. సైన్యం తిప్పికొట్టింది.

ఉగ్రవాదులు రాంబన్‌‌లోని ఓ ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో ఉన్నవారిని బంధీలుగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనంతరం భారత జవాన్లు ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఉగ్రవాదులు లొంగిపోవాలని హెచ్చరించినా..ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఆర్మీ కూడా జరిపిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు తీవ్ర వాదులు మరణించారు.ఉగ్రవాదుల చెరలో ఉన్న ఆరుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -