Thursday, May 2, 2024
- Advertisement -

దేశ వ్యాప్తంగా ఘ‌నంగా 69 వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుకలు…

- Advertisement -

దేశ రాజధానిలో 69వ గణతంత్ర వేడుకలు ఘనంగా అరంభమయ్యాయి. పది ఆసియా దేశాలకు చెందిన అధినేతలను ఈసారి వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరవ‌డం ప్ర‌త్యేకం. ముఖ్య అతిథులుగా హాజరైన ఆసియా దేశాధినేతలకు రాజ్‌పథ్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా రాజ్‌పథ్‌లో నిర్వహించిన సైనిక పరేడ్ అందరినీ అలరించింది. ఇండియా సార్వభౌమత్వాన్ని ప్రతిబింబిస్తూ వివిధ రకాల అత్యాధునిక క్షిపణులు, సైనిక విన్యాసాలతో సాగిన పరేడ్‌ను ప్రజలతోపాటు ముఖ్య అతిథులు తిలకించారు.

అతిథుల కోసం దాదాపు 100 అడుగుల పొడవైన వేదికను ఏర్పాటు చేయగా, భద్రత నిమిత్తం 60 వేల మంది సిబ్బందిని కేంద్రం కేటాయించింది. ఢిల్లీ పోలీసులతో పాటు బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఆర్ఏఎఫ్ సహా వివిధ విభాగాలు ఇందులో భాగస్వామ్యమయ్యాయి. పరిసర ప్రాంతాల భవనాలపై స్నిప్పర్స్‌ను ఏర్పాటు చేశారు. రాజ్‌పథ్‌లో ఆర్మీ పరేడ్‌తో పాటు సైనిక బలగాల ప్రదర్శనలు, సాంస్కృతిక ప్రదర్శనలు వేడుకగా నిర్వహిస్తున్నారు. వేడుకల సందర్భంగా దిల్లీ నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఎయిర్ ఫోర్స్ సీ-130 జే సూపర్ హెర్క్యులెస్, సీ-17 గ్లోబ్ మాస్టర్, సుఖోయ్ – 30 ఎంకేఐ ఎస్, లైట్ కాంబాట్ తేజాస్ విమానాలు గాల్లో చేసిన విన్యాసాలు అందరినీ ఆకర్షించాయి. టీ-90 ట్యాంకులు, బ్రహ్మోస్ క్షిపణులు, ఆకాశ్ ఆయుధ పరికరాలతోపాటు 113 మంది మహిళలతో కూడిన ‘సీమా భవానీ’ పరేడ్‌లో కదులుతున్న వేళ ఆహుతుల నుంచి విశేష స్పందన లభించింది. జవాన్లు చేసిన విన్యాసాలు కూడా ఆకర్షించాయి. కాసేపట్లో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ జాతీయపతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
తెలంగాణాలో:

తెలంగాణాలో 69వ గణతంత్ర వేడుకల్లో భాగంగా శుక్రవారం పరేడ్‌ గ్రౌండ్స్‌లో గవర్నర్‌ జెండా ఎగురవేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రగతి నివేదికను చదివివినించారు. జాతీయ సగటు కంటే మిన్నగా 18 శాతం వృద్ధి రేటుతో పరుగులు పెడుతోన్న తెలంగాణ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నదని గవర్నర్‌ నరసింహన్‌ చెప్పారు. అన్నిటికి అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు.

ఆంధ్ద‌ప్ర‌దేశ్‌లో :

గణతంత్ర వేడుకల్లో భాగంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గవర్నర్‌ నరసింహన్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకాకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -