Thursday, May 2, 2024
- Advertisement -

వంద మందితో ప్రపంచ జాబితా విడుదల

- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన వంద మంది మహిళల జాబితాను ఫోర్బ్స్  విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ కు చెందిన నలుగురు మహిళలకు స్ధానం దక్కడం విశేషం. ఇలా చోటు దక్కించుకున్న వారిలో స్టేట్ బ్యాంక్ ఇండియా చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య కూడా ఉన్నారు. ఆమెకు 25 వ స్ధానం దక్కడం విశేషం.

ఇక మిగిలిన వారిలో ఐసిఐసిఐ బ్యాంక్ ఎండి చందా కొచర్, బయోకాన్ వ్యవస్ధాపకురాలు కిరణ్ మజుందార్ షా, హెచ్ టి మీడియా అధినేత్రి శోభనా భర్తియా ఉన్నారు. వీరంతా వరుసగా 40 స్ధానం, 77 వ స్ధానం, 93 స్ధానాన్ని సాధించారు. ఇక ప్రపంచ శక్తివంతమైన మహిళల తొలి స్ధానంలో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్ ఉన్నారు. రెండో స్ధానాన్ని ఇద్దరు మహిళలు నిలిచారు.

వారిలో ఒకరు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న హిల్లరీ క్లింటన్ కాగా మరొకరు ఫెడరల్ రిజర్స్ చీఫ్ జానెట్ యెలెన్ ఉన్నారు. ఫేస్ బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షెరిల్ శాండ్ బర్గ్ ఏడో స్ధానాన్ని, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిచెల్ ఒబామా 13 స్ధానాన్ని, పెప్సికో సిఈవో ఇంద్రా సూయి 14 స్ధానంలోనూ నిలిచారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -