Monday, April 29, 2024
- Advertisement -

కాంగ్రెస్ చెప్పిందనో, ఇంకొకరు చెప్పారనో నేను మారాను: కేసీఆర్

- Advertisement -
single time loan waiver is impossible cm kcr on farmers issue

రైతులకు రుణమాఫీ చేస్తామన్న మాటకు ఇప్పటికీ తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అయితే ఒకేసారి రుణమాఫీ చేయడం తమ విధానం కాదని, కాంగ్రెస్ డిమాండ్ చేసిందనో, మరెవరో చెప్పారనో తమ విధానం మార్చుకోవడం కుదరదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

బుధవారం అసెంబ్లీలో వ్యవసాయంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం రాష్ట్రానికి ఎఫ్‌ఆర్‌బీఎం పెంచితే ఒకేసారి రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి చెప్పిన విషయం జానారెడ్డి గుర్తు చేశారు.

 దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ… బడ్జెట్లో పేర్కొన్నట్టుగా భూముల అమ్మకాల ద్వారా ఆదాయం పెరిగి, వాణిజ్య పన్నులు 4.5 కోట్లకు చేరి,  ఎఫ్‌ఆర్‌బీఎం 0.5 శాతం పెరిగితే ఒకేసారి రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట వాస్తవమేనని, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపుతో వచ్చిన ఆదాయంలో 3 వేల కోట్లు రుణమాఫీకే అందించామని అయితే వాణిజ్య పన్నుల ఆదాయం బాగా తగ్గిందని, నోట్లరద్దుతో భూముల మీద వచ్చే ఆదాయం కూడా తగ్గిందని ముఖ్య మంత్రి అన్నారు. రుణమాఫీ ఇప్పటికే 75 శాతం పూర్తయిందని, మిగిలిన 25 శాతం వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -