Friday, May 3, 2024
- Advertisement -

డేటా స్కామ్‌లో సంచ‌ల‌న విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టిన సిట్ అధికారి స్టీఫెన్ స‌న్‌..

- Advertisement -

ఏపీ డేటా స్మామ్ కేసు మ‌రో మ‌లుపు తిరిగింది. ఈ కేసును విచారిస్తున్న సిట్ ఇన్ ఛార్జ్ స్టీఫెన్ ర‌వీంద్ర‌. సేవా మిత్ర యాప్‌లో ఏపీ డేటాతో పాటు తెలంగాణాకు సంబంధించిన డేటా కూడా ఉంద‌ని బాంబు పేల్చారు. అస‌లు తెలంగానా డేటా సేవామిత్ర యాప్‌లోకి ఎలా వ‌చ్చింద‌నే దానిపై విచార‌ణ చేస్తామ‌ని తెలిపారు. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడైన అశోక్ అమ‌రావ‌తిలో ఉన్నా అమెరికాలో ఉన్నా వ‌దిలిపెట్ట‌బోమ‌న్నారు. తెలంగాణ ప్రజల డేటాను ఐటీ గ్రిడ్ ఎందుకోసం వాడుకుందో తెలుసుకుంటామని స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. డేటా చోరీ కేసు సైబరాబాద్, హైదరాబాద్ పరిధిలో కేసులు ఉండడంతో అన్ని కలిపి విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింద‌ని తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో ఇప్పటికే చాలా పురోగతి సాధించినట్లు తెలిపారు. కేసులో ప్రతి అంశాన్ని క్షుణ్నంగా దర్యాప్తు చేస్తున్నాం. డేటా చోరీలో ప్రమేయం ఉన్నవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. నిందితులు ఎవరైనా సరే వదిలేది లేద‌ని…. చట్టం ముందు అందరూ సమానులేన‌న్నారు . అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేసును పారదర్శకంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తామ‌న్నారు. ప్ర‌జల వ్యక్తిగత సమాచారం ఐటీ గ్రిడ్స్‌ సంస్థకు ఎలా వచ్చింది?. విశ్వసనీయంగా ఉంచాల్సిన డేటా ప్రైవేట్ సంస్థకు ఎవరిచ్చారు? తెలంగాణ ప్రజల డేటాతో ఏం చేయాలనుకున్నారు? అనే అంశాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. త్వ‌ర‌లోనె కేసును పూర్తి చేస్తామ‌న్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -