త‌లైవా రావా ప్లీజ్‌.. నా నిర్ణ‌యం ఇదే!

- Advertisement -

త‌నకు రాజ‌కీయాల్లోకి రావాల‌నే ఆస‌క్తి లేద‌ని సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. ద‌య‌చేసి ఈ విష‌యంలో త‌న‌ను ఇబ్బంది పెట్ట‌వ‌ద్ద‌ని, అభిమానుల‌కు సున్నితంగా విజ్ఞ‌ప్తి చేశారు. పొలిటిక‌ల్ ఎంట్రీ కుదర‌క‌పోవ‌డానికి గ‌ల‌ కారణాలు ముందే చెప్పాన‌ని, ఇక‌పై ఆ విష‌యం ప్ర‌స్తావించ‌వ‌ద్ద‌ని అన్నారు. ఈ మేర‌కు ట్విట‌ర్‌లో లేఖ విడుద‌ల చేశారు. కాగా డిసెంబ‌రులో అన్నాత్తే షూటింగ్ స‌మ‌యంలో హైదరాబాద్‌ లో రజనీకాంత్‌ అస్వస్థతకు గురైన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై యూట‌ర్్న తీసుకున్నారు. అనారోగ్యం కార‌ణంగా ఈ నిర్న‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు. దీంతో గ‌తేడాది డిసెంబర్‌ 31న ప్రకటిస్తానన్నరాజకీయ పార్టీ అంశంపై సందిగ్ద‌త వీడిపోయింది. అయితే ర‌జ‌నీకాంత్ నిర్న‌యాన్ని అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. త‌మ ఆరాధ్య న‌టుడిని ముఖ్య‌మంత్రిగా చూడాల‌ని ఉంద‌ని, ఆయ‌న‌తోనే త‌మిళ రాజ‌కీయాల్లో మార్పు వ‌స్తుంద‌ని దీక్ష‌ల‌కు దిగుతున్నారు.

- Advertisement -

త‌లైవా రాజ‌కీయాల్లోకి రావాల్సిందేన‌ని ఆందోళ‌న‌లు చేస్తున్నారు. అయితే ర‌జ‌నీ మాత్రం ఇందుకు సుముఖంగా లేరు. ఇక‌పై ఎన్న‌టికీ త‌న‌ను రాజ‌కీయ నాయ‌కుడిగా చూడ‌లేర‌ని, రాజ‌కీయాల్లోకి రాకుండానే ప్ర‌జాసేవ చేస్తానని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ ఫ్యాన్్స ఆందోళ‌న‌లు ఆగ‌డం లేదు. దీంతో ర‌జ‌నీ మ‌రోసారి స్వ‌యంగా లేఖ విడుద‌ల చేసి, వారికి స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. కాగా గత ఏడాది డిసెంబర్‌లో తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్టు ర‌జినీ ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

నేపాల్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలు..!

ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు పునః ప్రారంభం.. సిద్ధం అవ్వండి..!

కేటీఆర్ కేబినెట్‌లో ప‌ద‌వుల కోసం లొల్లి!

ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ‌కు భారీ షాక్‌..!

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...