Friday, May 10, 2024
- Advertisement -

స్వ‌ల్ప‌ న‌ష్టాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

- Advertisement -

వ‌రుస‌గా రెండో రోజూ కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు న‌ష్టాల‌ను మూట‌గ‌ట్టుకున్నాయి. రూపాయి విలువ మరింతగా పతనమవడం, డీజిల్ ధరలు జీవనకాల గరిష్ఠానికి పెరగడం మార్కెట్లపై ప్రభావం చూపింది. దీంతో స్వ‌ల్ప న‌ష్టాల‌తో స‌రిపెట్టుకున్నాయి మార్కెట్లు.

ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 32 పాయింట్లు నష్టపోయి 38,690కి పడిపోయింది. నిఫ్టీ 15 పాయింట్లు కోల్పోయి 11,676 వద్ద స్థిరపడింది.ట్రేడింగ్‌లో ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లకు గట్టి మద్దతు లభించింది. పీఎస్‌యూ బ్యాంకులు నిలదొక్కుకున్నాయి. ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్లు భారీగా నష్టాల్లో కొనసాగగా.. మన మార్కెట్లు మాత్రం స్థిరంగా ముగియడానికి ప్రధాన కారణం.. ఇవాళ ఆగస్టు నెల డెరివేటివ్స్ క్లోజింగ్ కావడమే.డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింత క్షీణించి 70.74 వద్ద కొనసాగుతోంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బాష్ లిమిటెడ్ (9.87%), గ్రీవ్స్ కాటన్ (7.81%), దేనా బ్యాంక్ (7.03%), ఎస్ఆర్ఈఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (6.63%), పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ (6.15%).

టాప్ లూజర్స్:
క్వాలిటీ (-4.98%), యూఫ్లెక్స్ లిమిటెడ్ (-4.84%), క్వెస్ కార్ప్ (-3.84%), హెచ్డీఐఎల్ (-3.80%), స్పైస్ జెట్ (-3.75%).

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -