Friday, May 10, 2024
- Advertisement -

స‌రికొత్త రికార్డ్స్ నెల‌కొల్పిన స్టాక్ మార్కెట్‌లు..

- Advertisement -

గురువారం మార్కెట్లు చాలా సానుకూలంగా సాగాయి. ట్రేడింగ్ లో సెన్సెక్స్, నిఫ్టీలు సరికొత్త రికార్డును సృష్టించాయి. ట్రేడింగ్ ప్రారంభ‌మైన కొద్ది సేప‌టికే సెన్సెక్స్ మార్కెట్ చరిత్రలో తొలిసారిగా 37 వేల మార్క్ ను తాకగా.. నిఫ్టీ 35 పాయింట్ల లాభం సాధించింది. సెన్సెక్స్ 126 పాయింట్లు లాభపడి 36,985 వద్ద, నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 11,167 వద్ద స్థిరపడ్డాయి.

జులై డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు నేటితో ముగుస్తుండటంతో చివరి గంటల్లో కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొన్న మార్కెట్ చివరి గంటల్లో బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల అండతో లాభాలను నిలబెట్టుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో 30లో 13 కంపెనీలు న‌ష్ట‌పోగా, 17 కంపెనీలు లాభాప‌డ్డాయి. ఎస్‌బీఐఎన్(5.62%), ఐసీఐసీఐ బ్యాంక్(4.08%), ప‌వ‌ర్ గ్రిడ్(4.04%), ఓఎన్‌జీసీ(1.98%), భార‌తీ ఎయిర్‌టెల్(1.98%) అత్య‌ధికంగా లాభ‌ప‌డ‌గా మ‌రో వైపు మారుతి(3.70%), యెస్ బ్యాంక్(3.61%), విప్రో(1.15%), ఏసియ‌న్ పెయింట్స్(1.08%), ఎల్ అండ్ టీ(1.06%) ఎక్కువ‌గా న‌ష్ట‌పోయాయి.
ఎన్‌ఎస్‌ఈలో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఐషర్ మోటార్స్‌, గ్రాసిమ్‌ షేర్లు లాభపడగా.. యస్‌ బ్యాంక్‌, మారుతి సుజుకీ, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం, భారత్‌ పెట్రోలియం షేర్లు నష్టపోయాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -