Friday, April 26, 2024
- Advertisement -

ఉచిత పథకాలపై.. సుప్రీం కోర్టు డైలమా ?

- Advertisement -

ప్రస్తుతం ఉచిత పథకాలకు సంభంధించి దేశ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ మద్య ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉచిత పథకాలపై అసహనం వ్యక్తం చేశారు. ఇక తాజాగా బీజేపీ నాయకుడు సుప్రీం కోర్టు లాయర్ అయిన అశ్వినీ ఉపాద్యాయ ఇటీవల ఉచిత పథకాలకు సంభంధించి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఉచిత పథకాల వల్ల బడ్జెట్ కొరత ఏర్పడుతోందని, ముఖ్యంగా ఆయా రాష్ట్రాలు పూర్తిగా ఉచిత పథకాలపైనే దృష్టి సాధిస్తూ.. రాష్ట్ర అధయానికి మించి అప్పులు చేస్తున్నారని, ఉచిత పథకాలను ఆపి, అభివృద్దిపైన దృష్టి కేంద్రికరించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఉచిత పథకాలకు సంబంధించి వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు ఎలక్షన్ కమిషన్ ను కోరగా.. అది తమకు సంబంధించిన విషయం కాదని ఎలక్షన్ కమిషన్ చెప్పుకొచ్చింది.

దాంతో సుప్రీం కోర్టు ఈ అంశంపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని కోరింది. అయితే ఈ ఉచిత పథకాలను ఆపడం సాధ్యమేనా అనే దాని గురించి విశ్లేషకులు చెబుతున్నా దాని ప్రకారం.. ఉచిత పథకాలకు ఏ రాజకీయ పార్టీ కూడా మినహాయింపు కాదు ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల్లో గెలిచేందుకు ఉచిత పథకాల హామీలు ఇస్తున్నాయి. వాటిలో కొన్ని పథకాలు ప్రజలకు ఉపయోగకరంగానే ఉన్నప్పటికి చాలా పథకాల వల్ల తీవ్ర ఆర్థిక నష్టం జరుగుతోంది. పిల్లలకు మద్యహ్న భోజన పథకం, అలాగే రెండు రూపాయలకే కిలో బియ్యం వంటి పథకాలు ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ఇవి కాకుండా పథకాల పేరుతో ప్రజల అకౌంట్లలో నగదు జమచేయడం వల్ల ముందు చూపు అభివృద్ది ఏమి ఉందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

దేశంలో పి‌ఎం కిషన్ యోజన కింద ప్రధాని ఉచితంగా రైతుల అకౌంట్లో నగదు వేస్తూ ఉంటే.. తెలంగాణలో రైతు బందు పేరుతో అదే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇక ఏపీ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.. ఎన్నో పథకాల పేరుతో ప్రజల అకౌంట్లో నగదు జమ చేస్తున్నారు ఏపీ సి‌ఎం జగన్.. ఆ విధంగా చాలా రాష్ట్రాలలో ఉచిత పథకాలనే ప్రధాన ఎజెండాగా అమలు చేస్తున్నారు. దాంతో ఆయా రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. అయినప్పటికి ఉచితల విషయంలో వెనక్కి తగ్గడంలేదు. మరి రాబోయే రోజుల్లో అనవసర ఉచిత పథకాలను అపేందుకు సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. కాబట్టి ఈ ఉచిత పథకాలకు ఏ రాజకీయ పార్టీ కూడా మినహాయింపు కాదు. కాబట్టి రాజకీయ పార్టీలు.

Also Read

అప్పుల ఊబిలో రాష్ట్రాలు.. ఎంతో తెలుసా ?

ఇండియాను విడిచిపెడుతున్న భారతీయులు !

మాట తప్పిన మోడీ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -