Thursday, May 2, 2024
- Advertisement -

అస‌లు క‌థ ఇప్పుడే మొద‌ల‌య్యింది…సుజ‌నాకు తిప్ప‌లు త‌ప్ప‌వా…?

- Advertisement -

టీడీపీ ఎంపీ బాబుకు అత్యంత స‌న్నిహితుడు సుజ‌నా చౌద‌రికి సీబీఐ, ఈడీ ఉచ్చు బిగిస్తోంది. ప‌లు డొల్ల కంపెనీల పేర్ల‌తో వేల కోట్లు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని ఎగ్గొట్టిన‌ట్టు రుజువు కావ‌డంతో ఈడీ, సీబీఐ సుజ‌నా చౌద‌రికి కంటిమీద కునుకు తేకుండా చేస్తున్నాయి. ఇటీ వ‌లె సుజ‌నా గ్రూపున‌కు సంబంధిచ‌న ఆస్తుల‌ను అటాచ్ చేసిన ఈడీ అటాచ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇద‌లా ఉంటె తాజాగా సీబీఐ స‌మ‌న్లు పంప‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకోవ‌డంతోపాటు తెలుగు త‌మ్ముళ్లు ఆందోళ‌న‌లో ఉన్నారు.

ఈ కేసుకు సంబంధించి సుజనా చౌదరికి చెందిన రూ. రూ.315 కోట్ల విలువైన ఆస్తులను ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ ఇంజినీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బీసీఈపీఎల్‌), దాని అధికారులపై సీబీఐ దాఖలు చేసిన కేసు ఆధారంగా ఈడీ ఈ చర్య తీసుకుంది. ఆ సంస్థ అధికారులు 2010-2013లో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఆంధ్రా బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌లను ‘మోసగించడానికి’ నేరపూరిత కుట్రకు పాల్పడటంతో బ్యాంకులకు రూ.364 కోట్ల మేర నష్టం కలిగినట్లు ఈడీ పేర్కొంది.

అయితే సీబీఐ నోటీసుల‌పై సుజ‌నా స్పందించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. సీబీఐ సమన్లలో పేర్కొన్నట్లుగా బెస్ట్‌ అండ్‌
క్రాంప్టన్‌ ఇంజనీరింగ్‌ కంపెనీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అసలు ఆ కంపెనీ గురించి తనకు ఏమాత్రం తెలియదని పేర్కొన్నారు.

సుజ‌నా గ్రూప్ పేరిట లిస్ట్ అయిన ప‌లు గ్రూపుల్లో 2003 నుంచి తాను నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో మాత్ర‌మే కొన‌సాగుతున్నాన‌ని, 2014 వ‌ర‌కు ఆ కంపెనీల్లో ఎలాంటి యాజ‌మాన్య బాధ్య‌త‌ల్ని నిర్వ‌హించ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఏది ఏమైనా అస‌లు క‌థ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది కాబ‌ట్టి విచార‌ణ‌లో అన్ని నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -