Thursday, May 2, 2024
- Advertisement -

తెలంగాణ అధికారుల ఫస్ట్రేషన్.. ఎందుకిలా.?

- Advertisement -

తెలంగాణ అఖిల భారత సర్వీసు అధికారుల్లో ఫస్ట్రేషన్ పీక్ స్టేజ్ కు చేరుకుంటోంది. వారి దూకుడే వారికి అడ్డుకట్ట పడుతోంది. అయితే లూప్ హోల్స్ పోస్టులకు వెళ్లిన వారు ఇప్పుడు నిరసన గళం వినిపిస్తుండడం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది..

మొన్నటికి మొన్న తెలంగాణ జైళ్ల శాఖ డీజీగా సర్వస్వతంత్రంగా వ్యవహరించిన వీకేసింగ్ దూకుడు ప్రభుత్వం కట్టడి వేసింది. ఆయన ప్రభుత్వంతో సంప్రదించకుండానే మార్పులు, చేర్పులు, సంస్కరణలు చేశారు. ఇది ప్రభుత్వానికి ఏకస్వామ్యంగా మారింది. అందుకే ఆయనను మార్చి ప్రాధాన్యం లేని స్టేషనరీ, ప్రింటింగ్ శాఖకు మార్చింది. దీనిపై నిరసన గళం వినిపించాడు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని.. బాగా పనిచేసిన వారికి గుర్తింపు లేదంటూ ఆడిపోసుకున్నాడు.

ఇక తాజాగా తెలంగాణలో మరో ఐఏఎస్ మురళి నిరసన గళం వినిపించారు. భూపాల జిల్లా కలెక్టర్ గా ఆయన తీసుకున్న నిర్ణయాలు, దుండుడుకు చర్యలు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాయి. సొంతంగా జిల్లాలో సంస్కరణలు చేసిన ఆయన తీరు వివాదాస్పదమైంది.అందుకే తాజాగా స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టు 31కి రిటైర్ అవుతానని ప్రకటించారు. విద్యారంగం తెలంగాణలో దారుణంగా ఉందని.. అద్వానంగా స్కూళ్లు ఉన్నాయని.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

ఇలా స్వతంత్రంగా వ్యవహరించే ఐఏఎస్ , ఐపీఎస్ లకు కేసీఆర్ సర్కారు అడ్డుకట్టవేస్తోంది. అయితే వారు దీన్ని అంగీకరించకుండా దూకుడుగా ముందుకెళ్తూ ప్రభుత్వంపై ఆడిపోసుకుంటున్నారు. ఇప్పుడు అసంతృప్త ఐఏఎస్ లు, ప్రభుత్వం మధ్య ఈ పొరపొచ్చాలు తెలంగాణ అధికార వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -