Monday, April 29, 2024
- Advertisement -

తాడిపత్రి లో జేసీ ఫిక్స్.. విజయవాడ లో భాగ్యలక్ష్మి..!

- Advertisement -

ఆసక్తితో పాటు ఉత్కంఠ రేకెత్తించిన అనంతపురం జిల్లా తాడిపత్రి పురపాలక ఛైర్మన్‌ ఎన్నిక… ఎట్టకేలకు తెలుగుదేశం వశమైంది. మున్సిపల్‌ ఛైర్మన్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. 18 మంది తెలుగుదేశం అభ్యర్థులతో పాటు సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు జేసీకే మద్దతు పలికారు. మొత్తంగా తెలుగుదేశం పార్టీకి 20 మంది సభ్యులు మద్దతు పలికారు. అధికార పార్టీ వైసిపికు 18 ఓట్లు దక్కాయి.

తాడిపత్రి అభివృద్ధి కోసం ఎన్నికైన ఛైర్మన్​కు సహాయ సహకారాన్ని అందజేస్తామని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు. పట్టణంలో ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగాయని .. ఆయన అన్నారు. గత 30 సంవత్సరాలుగా ఇలా ప్రశాంతంగా ఎన్నడూ ఎన్నికలు జరగలేదని పేర్కొన్నారు.

ఉత్కంఠ నడుమ ఎట్టకేలకు విజయవాడ మేయర్‌ పదవి 46వ డివిజన్‌ కార్పొరేటర్‌ రాయన భాగ్యలక్ష్మిని వరించింది. విజయవాడ నగరపాలక సంస్థ మేయరు పదవిని బీసీలకు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. దీనికి అనుగుణంగా రాయన భాగ్యలక్ష్మిని ఎంపిక చేశారు. అధికారికంగా దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ బుధవారం సాయంత్రం ప్రకటించారు.

పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌లు ఈమె పేరును ప్రతిపాదించారు. బండి పుణ్యశీల తనకు హామీ ఇచ్చారంటూ పట్టుబట్టినా.. బీసీలకు ఇవ్వాలని సీఎం చెప్పారంటూ సర్ది చెప్పారు. జనరల్‌ మహిళకు కేటాయించిన విజయవాడ మేయరు స్థానాన్ని బీసీలకు ఇచ్చామని వైసిపి ప్రకటించింది. దీంతో ఇవాళ విజయవాడ మేయర్​గా భాగ్యలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

హై కోర్టు లో చంద్ర బాబు పోరాటం..!

తెలంగాణ బ‌డ్జెట్‌ ప్ర‌వేశ పెట్టిన హ‌రీశ్ రావు.. రూ.2,30,825.96 కోట్లు!

రెజ్లర్ రితిక ఫొగట్ ఆత్మహత్య

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -