Friday, May 3, 2024
- Advertisement -

అనూహ్య మలుపు.. నేపాల్ పార్లమెంట్​ రద్దుకు సిఫారసు..!

- Advertisement -

నేపాల్​లో గత కొంతకాలంగా కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం అనూహ్య మలుపు తిరిగింది. ఆదివారం జరిగిన ఓ అత్యవసర సమావేశంలో.. నేపాల్​ పార్లమెంట్​ రద్దుకు ఆ దేశ ప్రధాని కేపీ ఓలి సిఫారసు చేసినట్టు స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి. మంత్రి మండలితో చర్చించిన అనంతరం ఓలి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాయి.

నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ(ఎన్సీపీ) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పుష్పకుమార్ దహాల్ ప్రచండతో తలెత్తిన వివాదం తీవ్రస్థాయికి చేరిన తరుణంలో ఓలి ఈ నిర్ణయం తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

మరోవైపు నేపాల్​ మంత్రిమండలి నిర్ణయాన్ని అధికార పార్టీ నేత నారాయణ్​కాజీ తప్పుబట్టారు. మంత్రులందరూ లేకుండానే నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఇది దేశ అభివృద్ధికి నష్టం కలిగిస్తుందని మండిపడ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -