Wednesday, May 8, 2024
- Advertisement -

థర్డ్ ఫ్రంట్ లో జేరే తెలుగు పార్టీలు ఏవి ?

- Advertisement -

ఒకప్పుడు అంత బలం లేని, బలం చూపలేని థర్డ్ ఫ్రంట్ ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటోంది మరీ ముఖ్యంగా బీహార్ ఎన్నికల తరవాత నితీష్ కుమార్ – లాల్లూ ల గెలుపు దేశ వ్యాప్తంగా రాజకీయాలని తీవ్రంగా ప్రభావం చేస్తోంది. థర్డ్ ఫ్రంట్ కి మళ్ళీ కొత్త బీజం వేస్తోంది ఈ తరుణం.

మూడవ కూటమి, థర్డ్ ఫ్రంట్ గా పిలవబడే ఈ కూటమి కొత్తదేమీ కాదు. అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లాంటి హేమాహేమీలు ఒకే వేదిక మీదకి రావడానికి ఈ థర్డ్ ఫ్రంట్ బాగా ఉపయోగ పడింది. వీరితో పాటు మరికొన్ని రాజకీయశక్తులు తెరమీదకి వచ్చాయి. ఈ కూటమిలో ఎవరి దారి వారిదే అన్నట్టు వ్యవహరించడంతో కొద్ది నెలలో ఈ కూటమి కనపడకుండా పోయింది.

స్వర్గీయ ఎన్టీఆర్‌ సైతం జాతీయ స్థాయిలో కొత్త ప్రత్యామ్నాయం కోసం తన వంతు కృషి ఈ కూటమి కోసం చేసారు. బీహార్ ఎన్నికల్లో రాష్ట్రం లో విజయం సాధించిన నితీష్ కన్ను ఇప్పుడు దేశ రాజకీయాలమీద పడింది. కొత్త కూటమి ఖచ్చితంగా రావాల్సిన తరుణం అని నితీష్ ఆలోచిస్తున్నారు.  మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌, జయలలిత, నితీష్‌కుమార్‌ తదితరులు ఇప్పటికే ‘థర్డ్‌ ఫ్రంట్‌’ దిశగా కసరత్తులు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.

కానీ నితీష్ కుమార్ కాంగ్రెస్ కి బాగా స్నేహితుడు కాబట్టి కాంగ్రెస్ కి ఇది మింగుడు పడే వ్యవహారం కానే కాదు, రాబోయే రోజుల్లో తృతీయ కూటమి దేశ రాజకీయాలలో ఆసక్తికర ఫలితాలు రాబడుతుంది అని అంటున్నారు విశ్లేషకులు. ఏపీ , తెలంగాణా జిల్లాల్లో కొన్ని పార్టీలు ఈ థర్డ్ ఫ్రంట్ లో జేరడం కోసం చూస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ – బీజేపీ ల మైత్రి ఎన్నాళ్ళు కొనసాగుతుందో తెలీని 

పరిస్థితి. అలాగే కేంద్రం లో ఉన్న బీజేపీ , కాంగ్రెస్ లకి వ్యతిరేకంగా ఉన్న తెరాస కి కూడా ఈ థర్డ్ ఫ్రంట్ మీద ఆసక్తి ఉంది. వైకాపా సంగతి చెప్పనక్కరలేదు. ఈ కొత్త ప్రత్యామ్న్యాయం వైపు ఎందరు వెళతారు అనేది చూడాల్సి ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -