Thursday, May 2, 2024
- Advertisement -

కేబినేట్‌లో మ‌రొక‌రికి మంత్రి ప‌ద‌విని ఖ‌రారు చేసిన జ‌గ‌న్

- Advertisement -

ఫ‌లితాలు రాక‌ముందె వైసీపీ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌పై దృష్టిసారించిన‌ట్లు స‌మాచారం. ఎన్నిక‌ల్లో వైసీపీదే విజ‌యం అని అన్ని స‌ర్వేలు తేల్చేశాయి. అయితే పార్టీలో మంత్రి ప‌ద‌వుల కోసం భారీ పోటీ త‌ప్పేట‌ట్టులేదు. కాంగ్రెస్‌, టీడీపీ నుంచి వ‌చ్చిన ప‌లువురు సీనియ‌ర్ నేత‌లు, పార్టీ పెట్టిన‌ప్ప‌టినుంచి ఆయ‌న వెంటే న‌డుస్తున్న నేత‌లు సైతం జగన్ క్యాబినెట్‌లో బెర్త్ కోసం అప్పుడే ఖ‌ర్చీప్‌లు వేస్తున్నారు.ఇక పోలింగ్ ముగిశాక వైసీపీ గెలుస్తుంద‌న్న అంచ‌నాల‌తో ఇప్ప‌టికే చాలామంది మంత్రి పదవుల విషయంలో లాబీయింగ్‌లు మొదలుపెట్టినట్టుగా సమాచారం .

పాద‌యాత్ర‌లోను, ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ వైఎస్ జ‌గ‌న్ ముగ్గురికి మంత్రి ప‌ద‌వులు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.చిలకలూరిపేటలో మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్, విడుదల రజనీ కోసం తన సీటును వదులుకున్నారు. ఈ క్రమంలోనే పేటలో జరిగిన బహిరంగ సభలో రాజశేఖర్‌కు మంత్రి పదవి ఇస్తున్నట్టు జగన్ ఓపెన్‌గానే ప్రకటించారు.

జిల్లాలో మంగళగిరిలో సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ మీద పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిపిస్తే ఆయనకు సైతం తన కేబినెట్‌లో చోటు ఇస్తానని చెప్పారు. ఇక ఒంగోలు నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి సైతం మంత్రి పదవి ఇస్తానని ఒంగోలులో జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రకటించారు.

ఇప్పుడు మ‌రో వ్య‌క్తికి మంత్రి ప‌ద‌వి అన‌ధికారికంగా మంత్రి ప‌ద‌విని ఖ‌రారు చేసిన‌ట్లు ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగుతోంది. అది కూడా సొంత జిల్లా క‌డ‌ప‌నుంచి.ఆ వ్య‌క్తి ఎవ‌రో కాదు.. రాజంపేట వైసీపీ అభ్య‌ర్థి మేడా మ‌ల్లిఖార్జున‌రెడ్డి. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలో టీడీపీ గెలిచిన ఏకైక సీటు రాజంపేట‌. రాజ‌కీయ ప‌రిస్థితుల కార‌నంగా ఆయ‌న వైసీపీ త‌రుపునుంచి పోటీ చేశారు.ఇక ఈ ఎన్నిక‌ల్లో రాజంపేట‌లో మేడా గెలుపు ఖాయ‌మ‌న్న టాక్ వ‌స్తోంది. అదే జ‌రిగితే ఈ సారి ఆయ‌న‌కు మంత్రి పదవి కూడా గ్యారెంటీ అనే ప్రచారం జరుగుతూ ఉంది. వీరితో పాటు చాలా మంది నేత‌లు మంత్రి ప‌ద‌వుల‌పై ఆశ‌లు పెట్టుకున్నారు. సొంత జిల్లానుంచి పోటీ ఎక్కువ‌గా ఉండ‌టంతో జ‌గ‌న్‌కు మంత్రి వ‌ర్గ‌కూర్పు క‌త్తిమీద సామువంటిదే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -