Tuesday, April 30, 2024
- Advertisement -

ఐదుగురు డిప్యూటీ సీఎంలు.. జగన్ సాహసం

- Advertisement -

ఏపీ ముఖ్యమంత్రి జగన్ సామాజిక కోణంలో ఆలోచించి మంత్రి పదవుల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా తన కేబినెట్ లో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను తీసుకుంటుండడం సంచలనంగా మారింది. ఇందులో అన్ని సామాజికవర్గాలకు జగన్ చోటు కల్పిస్తుండడం విశేషంగా మారింది..

ఏపీలో సీఎంగా జగన్ పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజికవర్గ నేతలు ఐదుగురికి ఐదు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఏపీ కేబినెట్ లో ఉండే మొత్తం 25మందిని ఒకేసారి ఎంపిక చేసి మంత్రి పదవులు ఇవ్వడానికి రెడీ అయినట్లు తెలిసింది. ఇందులో ఒకరికి మహిళను తీసుకోబోతున్నట్టు తెలిసింది.

ఎన్నికల వేళ కూడా జగన్ బీసీలు, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అమిత ప్రాధాన్యం ఇచ్చి టికెట్లు ఇచ్చారు. వైసీపీ గాలిలో వారంతా గెలిచారు. దీంతో కేబినెట్ లో కూడా ఏపీలోని మెజార్టీవర్గాలకు న్యాయం చేయడం కోసమే ఐదు డిప్యూటీ సీఎం పోస్టులను జగన్ ప్రకటించినట్టు సమాచారం.

తాజాగా వైసీపీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. బీసీ వర్గానికి చెందిన తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ కు డిప్యూటీ సీఎం పోస్టు ఇస్తారని సమాచారం. మైనార్టీ వర్గానికి మాజీ పోలీస్ అధికారి ఇక్బాల్ కు డిప్యూటీ సీఎం ఇస్తారని తెలుస్తోంది. ఎస్టీ కేటగిరిలో విజయనగరం జిల్లా నుంచి.. ఎస్సీ వర్గం నుంచి ప్రకాశం జిల్లానుంచి డిప్యూటీ సీఎంలు చేస్తారని తెలుస్తోంది. కాపులను పశ్చిమ గోదావరి జిల్లా నుంచి డిప్యూటీ సీఎంగా ఎంపిక చేస్తారని సమాచారం. ఇలా ఐదు మేజర్ కులాలకు జగన్ డిప్యూటీ సీఎం పదవులు కట్టబెడుతుండడం సంచలనంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -