Thursday, May 2, 2024
- Advertisement -

ఆ విష‌యంలో ఆద‌ర్శంగా నిలుస్తున్న జ‌గ‌న్…హ్యాట్సాఫ్ సీఎం సాబ్‌

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌బోతున్న వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ప‌రిపాల‌న క‌త్తి మీద సాములాంటిదే. ఇప్ప‌టికే ల‌క్ష‌ల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిని చ‌క్క‌దిద్ద‌టం ఇప్పుడు అత్య‌వ‌స‌రం. బాబు పాల‌న‌లో జ‌రిగి అడ్డ‌గోలు ఖ‌ర్చుల వ‌ల్ల రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. ఇప్ప‌టికే లోటు బ‌డ్జెట్‌లో ఉండ‌టంతోపాటు ఉద్యోగుల‌కు జీతాలు కూడా ఇవ్వ‌లేని ప‌రిస్థితిలో ఆర్థిక శాఖ ఉంది. ఇప్పుడు జ‌గ‌న్ దుబారా ఖ‌ర్చుల‌ను త‌గ్గించే ప‌నిలో ప‌డ్డారు జ‌గ‌న్‌. ఆ ప‌నేదో త‌న ద‌గ్గ‌ర‌నుంచి మొద‌లు పెడుతున్నారు. సాక్షాత్తు సీఎంమే ఆ ప‌నిచేస్తుంటె కిందిస్థాయి అధికారులు, ఎమ్మెల్యేల్లో కూడా భ‌యం మొద‌ల‌వుతుంది.

వ‌చ్చే ఆదాయానికి మించి ఖ‌ర్చు ఉండకూడ‌ద‌నే సాధార‌ణ కుటుంబాల్లోనే బ‌డ్జెట్‌ను ఏర్పాటు చేసుకుంటారు.రాష్ట్ర ప్ర‌భుత్వం విష‌యంలో ముఖ్యంగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం దుబారాకు పెద్ద‌పీట వేసింది. అవ‌స‌రం ఉన్నా లేకున్నా కోట్ల ప్ర‌జాధ‌నాన్ని త‌న అనుచ‌రుల‌కు దోచి పెట్టారు.

ఇక అలాంటి త‌ప్పుల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా జ‌గ‌న్ ప‌క‌డ్బంధీ నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. టు బ‌డ్జెట్‌లో ఉన్న రాష్ట్రం నెల‌కు రూ.20 వేల కోట్ల వ‌ర‌కు వ‌డ్డీలే క‌ట్టాల్సిన ప‌రిస్థితిలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌ట్టాలు ఎక్కించేం దుకు కొన్ని క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకునేందుకు రెడీ అయ్యారు.

తాజాగా ఈ నెల 30న ఏపీ నూత‌న రెండో ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసేందుకు రెడీ అయిన జ‌గ‌న్ ఈ కార్య‌క్ర‌మానికి అయ్యే ఖ‌ర్చును భారీగా త‌గ్గించేశారు. దుబారా ఖ‌ర్చుల‌ను త‌గ్గించ‌డానికి త‌న నుంచె మొద‌లు పెట్టారు. 2014లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఏర్ప‌డిన నేప‌థ్యంలో సీఎంగా చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి చేసిన ఖ‌ర్చు దాదాపు 5 కోట్ల పైమాటే. ఆత‌ర్వాత కృష్ణా పుష్క‌రాలు, గోదావ‌రి పుష్క‌రాలు స‌హా వివిధ కార్య‌క్ర‌మాల పేరుతో ఆయ‌న చేతికి ఎముక‌ లేకుండా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెల‌సిందే.

జ‌గ‌న్‌.. త‌న ప్ర‌మాణ స్వీకారాన్ని అత్యంత సాదాసీదాగా నిర్వ‌హించాల‌ని సీఎస్ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యంను ఆదేశించార‌ట‌. ఈ కార్య‌క్ర‌మానికి మొత్తం ఖ‌ర్చు ఎంత అవుతుందో సీఎస్‌ను అడ‌గ‌డంతో క‌నీసం 5 నుంచి 10 ల‌క్ష‌ల మ‌ధ్య అవుతుంద‌ని ఎల్వీ చెప్పార‌ట‌. దీంతో జ‌గ‌న్ అలా అవ‌డానికి వీలులేదు. ప్ర‌జ‌ల ఆదాయం పెంచేందుకు మ‌న‌కు ప్ర‌భుత్వ ప‌గ్గాలు అప్ప‌గించారు. త‌న ప్ర‌మాణ‌స్వీకారానికి రూ. 2 ల‌క్ష‌ల‌కు మించ‌కుండా ఏర్పాట్లు చేయండి అని ఆదేశించిన‌ట్టు ఆల‌స్యంగా వెలుగు చూసింది.మునిసిప‌ల్ స్టేడియం ఎలాగూ ప్ర‌భుత్వానిదే.. కుర్చీల‌ను మునిసిపాలిటీ ఏర్పాటు చేస్తుంది. వ‌చ్చే అథిధుల‌కు ప్ర‌భుత్వ స‌ముదాయాల్లో వ‌స‌తి ఏర్పాట్లు చేస్తున్నారు. జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యానికి అధికాఉల‌నుంచె కాకుండా విమ‌ర్శ‌కుల నుంచి కూడా ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -