తెలంగాణకు శత్రువు మోడీనే !

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ ఈ మద్య కాలంలో మోడీ పై విమర్శలు గుప్పించడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో ఇంకే సమస్య లేనట్లు సమయం దొరికినపుడల్లా మోడీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. అసలు కేంద్రం నుంచి రాష్ట్రనికి నిధులు ఏవి రాలేదని, రాష్ట్రనికి కేంద్రం చేసిందేమి లేదని, కేంద్రంలో మోడీది క్రూరమైన పరిపాలన అంటూ మోడీ టార్గెట్ గా కే‌సి‌ఆర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ మద్య ఇలాంటి వ్యాఖ్యలు మరింత శృతిమించుతున్నాయి. ఏకంగా తెలంగాణకు ప్రధాన శత్రువు మోడినే అని ప్రకటించారంటే కే‌సి‌ఆర్ మోడీని ఏ రేంజ్ లో టార్గెట్ చేశాడో అర్థం చేసుకోవచ్చు.

అయితే ఏ రాజకీయ పార్టీల మద్య అయిన పరస్పర విమర్శలు వాదోపవాదాలు ఉండడం సహజం. ఏ పార్టీలు కూడా పూర్తి స్థాయిలో మిత్రపక్షంగాను అలాగే పూర్తి స్థాయిలో శత్రుత్వం గాని ఉండదు. అయితే గతంలో కేంద్రానికి మద్దతిస్తూ మోడీకి అనుకూలంగా ఉన్న కే‌సి‌ఆర్ ప్రస్తుతం ఈ స్థాయిలో వ్యతిరేకత చూపడానికి కూడా కారణం ఉందనే సంగతి మానందరికి తెలిసిందే. ఈ మద్య కాలంలో తెలంగాణలో బీజేపీ హవా విపరీతంగా పెరిగింది. ఏకంగా ఎదురే లేదని చెప్పుకుంటే టి‌ఆర్‌ఎస్ కె కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దాంతో బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకు టి‌ఆర్‌ఎస్ విశ్వ ప్రయత్నలే చేస్తోంది. అందులో భాగంగానే కే‌సి‌ఆర్ మోడీ పై ఈ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

అయితే కే‌సి‌ఆర్ వ్యాఖ్యలను మోడీ లైట్ తీసుకుంటున్నప్పటికి టి‌ఎస్ కమలనాథులు మాత్రం గట్టిగానే కౌంటర్లు వేస్తున్నారు. తెలంగాణకు ప్రధాన శత్రువు మోడీ నే అని కే‌సి‌ఆర్ అనడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. మరి కే‌సి‌ఆర్ వ్యాఖ్యలకు ధీటుగా బీజేపీ నేతలనుంచి ఎలాంటి కౌంటర్లు వస్తోయో చూడాలి.

Also Read

అర్ధం కానీ “రాహుల్ “.. కాంగ్రెస్ కు తప్పని తిప్పలు !

ఎన్డీయేను వదిలించుకున్న తప్పని తలనొప్పి ..!

జగన్ సారు.. గాల్లో మేడల కట్టడం ఆపండి !

Related Articles

Most Populer

Recent Posts