Friday, May 3, 2024
- Advertisement -

ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ ఫైర్ బ్రాండ్

- Advertisement -

జ‌గ‌న్ మంత్రి వ‌ర్గంలో స్థానం ద‌క్క‌ని రోజాకు జ‌గ‌న్ స‌ముచిత స్థానం క‌ల్పించారు. ఈరోజు ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. రిబ్బన్ కట్ చేసి.. భర్త సెల్వమణితో కలిసి ఛాంబర్‌లోకి అడుగుపెట్టిన రోజా.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా రోజా మాట్లాడుతూ ఇంతవరకూ ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా మహిళలు ఎవ్వరూ చేయలేదని, ఈ అవకాశం తనకు దక్కడం చాలా సంతోషంగా ఉందని, ఈ పదవి చాలా పెద్ద బాధ్యతతో కూడుకున్నదని అన్నారు. జ‌గ‌న్ కు ప్ర‌భుత్వానికి మంచి పేరు తెస్తాన‌ని తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ ఎలాగైతే పెద్ద పీట వేస్తున్నారో, అలాగే, ఏపీఐఐసీ ద్వారా కూడా చేస్తానని, వాళ్లను కూడా ముందుకు తీసుకెళ్లేందుకు పాటుపడతానని చెప్పారు. గత ప్రభుత్వం అడ్డదిడ్డంగా కేటాయింపులు చేసిందని, పెట్టుబడుల విషయంలో కూడా అన్నీ కాకిలెక్కలు చెప్పిందని విమర్శించారు

పెట్టుబడిదారులకు అన్నిరకాలుగా సహకరిస్తామని, అన్ని జిల్లాల్లో పారిశ్రామిక రంగానికి కృషి చేస్తామని చెప్పారు. పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమలకు ఏర్పాటుకు పారదర్శకంగా భూముల కేటాయింపు జరుగుతుందని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో నగరి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రోజా.. జగన్ కేబినెట్‌లో మంత్రి పదవి ఆశించారు. కాని రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల వ‌ల్ల మంత్రి ప‌ద‌వి రాలేదు. దాంతో అసంతృ వ్య‌క్తం చేయ‌డంతో జ‌గ‌న్ బుజ్జ‌గించారు. ఆ వెంటనే ఆమెకు ఏపీఐఐసీ ఛైర్మన్‌ పదవి దక్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -