Friday, April 26, 2024
- Advertisement -

పేదల కోసం సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

- Advertisement -

సాధారణంగా డయాబెటిక్‌ ప్రొఫైల్‌, థైరాయిడ్‌, లివర్‌ పంక్షన్‌, లిపిడ్‌ ప్రొఫైల్‌, సిరం ఎలాక్ట్రాలైటిస్‌.. పాథాలోజి టెస్ట్‌ ఇలా ఏ పరీక్షలు చేయించుకోవాలంటే తలకు మించిన భారం అన్న విషయం తెలిసిందే. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోనైతే వేలల్లో వసూలు చేస్తారు. అయితే ఇప్పుడు సామాన్య ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో దూరదృష్టితో పేదలకు వ్యాధి నిర్ధరణ పరీక్షలు ఉచితంగా నిర్వహించేందుకు తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సెంటర్లను అందుబాటులోకి తెచ్చింది.

19 జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. మహబూబ్ నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, జనగాం, ములుగు, మహబూబాబాబద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సిద్ధిపేట, నల్గొండ, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్, నిర్మల్, కరీంనగర్, ఆదిలాబాద్, గద్వాల, అసిఫాబాద్ జిల్లాల్లో ప్రధాన వైద్య కేంద్రాలలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకున్న డయాగ్నొస్టిక్ కేంద్రాలను ప్రారంభించాలని వైద్యాధికారులను ఆదేశించారు. డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో మొత్తం 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారని సీఎం కేసీఆర్ తెలిపారు.

అందులో కరోనా పరీక్షలతో పాటుగా.. రక్త పరీక్ష, యూరిన్ టెస్ట్ సహా బీపీ షుగర్, గుండె జబ్బులు, బొక్కల జబ్బులు, లివర్, కిడ్నీ, థైరాయిడ్ వంటి వాటికి సంబంధించిన ఎక్స్‌ రే బయోకెమిస్ట్రీ పాథాలజీకి సంబంధించిన పరీక్షలు చేస్తారని వెల్లడించారు. ప్రభుత్వ డయాగ్నోసిస్ కేంద్రాల్లో అత్యంత సామర్థ్యంతో కూడుకుని అత్యంత వేగంగా రిపోర్టులందించనున్నాయి.

కరోనా వంటి వ్యాధుల నేపథ్యంలో, రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సహా పలు ఇతర ప్రభుత్వ దవాఖానాల్లో మౌలిక వసతులను మెరుగుపరిచామని కేసీఆర్ చెప్పారు. బాలింతలు తల్లీ బిడ్డల రక్షణ రవాణా కోసం అమ్మఒడి పథకం ద్వారా ఇప్పటికే 300 వాహనాలను ఏర్పాటు చేసి వైద్యాన్ని అందిస్తున్నదని సీఎం అన్నారు.

కరోనాతో ఆడ సింహం మృతి

ఈటెలపై మంత్రి హరీష్ రావు ఫైర్…

వామ్మో ..ప్రభాస్ ఆది పురుష్ రెమ్యూనరేషన్ తెలిస్తే కళ్ళు తిరిగిపోవాల్సిందే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -