Saturday, April 20, 2024
- Advertisement -

లాక్ డౌన్ పై కేసిఆర్ గరం గరం.. ఏమన్నారు అంటే..!

- Advertisement -

కరోనా నియంత్రణలో తెలంగాణ నంబరు వన్​గా ఉన్నట్లు సీఎం కేసీఆర్ శాసనసభలో పేర్కొన్నారు. కరోనా ఉద్ధృతి దృష్ట్యానే విద్యాసంస్థలను మూసివేయించామని స్పష్టం చేశారు. ఆ బాధతోనే విద్యాసంస్థలను మూసివేశామన్నారు. కరోనా విస్పోటనమైన రూపం తీసుకోకముందే చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.


కరోనాతో ప్రపంచమే తీవ్ర ఒత్తిడిలో ఉందని వ్యాఖ్యానించారు. ఎవరికి అంతుపట్టకుండా తెలంగాణ సహా ప్రపంచాన్ని వేధిస్తోందని అన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కేంద్రం చేతిలో ఉందని చెప్పారు. కేంద్రం టీకా డోసులను అన్ని రాష్ట్రాలకు సమానంగా పంపిణీ చేస్తోందని తెలిపారు. తాత్కాలికంగానే విద్యాసంస్థలు మూసివేసినట్లు ప్రకటించారు.

లాక్‌డౌన్ వల్ల గతేడాది చాలా నష్టపోయామని సీఎం కేసీఆర్ అన్నారు. తొందరపడి లాక్‌డౌడ్‌ పెట్టబోమని స్పష్టం చేశారు. మాస్క్‌లు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలని సూచించారు.

డాక్టర్స్ కి షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం..? సొంత ఆసుపత్రి ఉంటే ఇక అంతే..!

నాగార్జున సాగర్ ఉపఎన్నిక.. వైసీపీ అభ్యర్థి నామినేషన్!

వార్ధాలో 60 గంటల లాక్‌డౌన్‌..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -