Monday, April 29, 2024
- Advertisement -

వైసీపీలో చేరేందుకు సిద్దంగా 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు…?

- Advertisement -

వర్షాకాలంలో కూడా ఆంధ్రప్రదేవ్ లో రాజకీయం వేడెక్కింది. పోలవరం రివర్స్ టెండరింగ్, రాజధాని, వరదల పరిస్థితులపై వైసీపీ, టీడపీ పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ప్రస్తుతం సీఎం జగన్ విదీశీ పర్యటనలో ఉన్నారు. ఇలాంటి సమయంలో పోలవరం విషయంలో హైకోర్టు షాక్ ఇచ్చింది. దీనిపై టీడీపీ నేతలు వరుస విమర్శలతో దాడి చేస్తున్నారు. మరో వైపు వైసీపీ కూడా అంతే స్థాయిలో వాటిని తిప్పికొడుతోంది.

ఇదలా ఉంటె తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు టీడీపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గనక ఒప్పుకుంటే టీడీపీ పార్టీ నుండి దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు వైసీపీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారని అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరిన విషయాన్ని గుర్తు చేస్తూ జగన్ అంగీకరిస్తే 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసిపిలో చేరుతారని ఆయన అన్నారు. తన ఇంటిని కూల్చివేయాలనే కుట్రలో భాగంగానే కృష్ణా నది వరదలను కృత్రిమంగా సృష్టించారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలను ఆయన ఖండించారు. కృత్రిమ వరదలనే కొత్త పదాన్ని చంద్రబాబు సృష్టించారని ఆయన ఎద్దేవా చేశారు.జగన్ సరిగ్గా ద్రుష్టి పెడితే మాత్రం ఏపీలో టీడీపీ అంత కూడా ఖాళీ అవుతుందని, కానీ కొన్ని సమీకరణాల వలన జగన్ అంతటి దారుణానికి ఒడిగట్టడం లేదని అవంతి తెలిపారు

వరదలను కృత్రిమంగా సృష్టించే విద్య చంద్రబాబుకు తెలిసి ఉంటే వర్షాలు లేని విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో సృష్టించాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరో వైపు భాజాపా ఎంపీ సుజనా చౌదరిని కూడా టార్గెట్ చేశారు.బీజేపీలో చేరిన సుజనా చౌదరి టీడీపీ పాట పాడుతున్నారని, ఇదంతా కూడా చంద్రబాబు ప్లాన్ లాగే అనిపిస్తుందని ఎద్దేవా చేశారు. సుజనా చౌదరి ఇప్పటికైనా ఏ పార్టీలో ఉన్నారనేది తెలుసుకోవాలని హితవు పలికారు.

రాజధానిని మార్చడంపై పలు వార్తలు వస్తున్నాయని టీడీపీ నేతలు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని, ఒకవేళ అదే నిజమైతే గనక ప్రభుత్వం అధికారికంగానే ప్రకటిస్తుందని స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -