Wednesday, May 1, 2024
- Advertisement -

అద్దంకి సభకు సర్వం సిద్ధం..

- Advertisement -

వైసీపీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు సీఎం జగన్ చేపట్టిన సిద్ధం సభలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే భీమిలి, దెందులూరు, రాప్తాడు నియోజకవర్గాల్లో భారీ ఎత్తున సభలు నిర్వహించి ఎన్నిలకు తాము సిద్ధం అని పొలికేక పెట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అదే సిరీస్ లో భాగంగా ఇప్పుడు అద్దంకి నియోజకవర్గంలోని మేదరమెట్లలో మరో బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 40 అసెంబ్లీ నియోజకవర్గాల క్యాడర్ను ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం చేసే లక్ష్యంతో నిర్వహిస్తున్న సిద్ధం సభకు సంబంధించి ఇప్పటికే ప్రచారం మొదలైంది.

దాదాపు పదిహేను లక్షల మంది కార్యకార్యకర్తలు హాజరవుతారని భావిస్తున్న మెదరమెట్ల సభ పార్టీకి మరింత ఊపు తేనుంది.భీమిలీ, దెందులూరు, రాప్తాపాడు లలో జరిగిన సభలు రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దమ్మును, ప్రజాదరణను తెలియజేయగా ఈ నాలుగో సభ కూడా ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తే విధంగా నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేశారు.లక్షలాది మంది హజరయ్యే ఈ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.ఎక్కువ మంది వీక్షించే విధంగా ఎల్ ఈడీ స్క్రీన్ లు అమర్చారు.సీఎం వైయస్ జగన్ కార్యకర్తలకు మరింత చెరువ కావడానికి వీలుగా ర్యాంప్ లు ఏర్పాటు చేశారు.ఇదే సభలో సీఎం వైయస్ జగన్ ఎన్నికల మేనిఫేస్టో లో కొన్ని అంశాలను విడుదల చేసే అవకాశం ఉంది.

ఇటు వరుస సిద్ధం సభలతో వైఎస్సార్ సీపీ దూసుకుపోతుండగా అటు ప్రత్యర్ధి టీడీపీ, జనసేన కూటమి ఇలాంటి సభ ఒక్కటి కూడా నిర్వహించలేకపోవడం వారి అనైక్యతను, ప్రజల్లో వారికున్న బలాన్ని తేటతెల్లం చేస్తోంది.ఒకవైపు అభ్యర్ధులను ప్రకటిస్తూ.. వరుస సభలతో వైసీపీ దూసుకుపోతుంటే టీడీపీ కూటమి పొత్తులు, బేరసారాల పేరుతో ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంది.

మెదరమెట్ల సిద్ధం సభ తర్వాత ప్రజల్లో సీఎం వైయస్ జగన్ కు ఉన్న ఆదరణ మరోమారు తెలుస్తుంది . దీంతరువాత ప్రతిపక్షాల పరిస్థితి దిక్కుతోచని విధంగా తయారవుతుంది.మరోవైపు ఇప్పటికే ఆంధ్రాలో మళ్ళీ జగనే వస్తారనే పాజిటివ్ టాక్ ప్రారంభమైంది. చంద్రబాబు, పవన్, బిజెపి .. ఇలా ఎన్ని పార్టీలు కలిసినా జగన్ ను ఎదుర్కొవడం అంత ఈజీ కాదని టాక్ వినిపిస్తోంది.అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి పథకాలతో అన్నివర్గాల ప్రజలను ఆకట్టుకున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని నిలువరించడం కష్టమని ఇప్పటికే టీడీపీ, జనసేన క్యాడర్ అభిప్రాయపడుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -