Thursday, May 9, 2024
- Advertisement -

దేశంలో మన రాష్ట్రానికీ మరో రికార్డ్..!

- Advertisement -

పీఆర్సీ నివేదిక ప్రకారం 7.5శాతమే వేతనాలు పెంచాలని ఉన్నప్పటికీ.. 30శాతం పీఆర్సీ ప్రకటించి ఉద్యోగుల పట్ల తనకున్న ప్రేమను సీఎం కేసీఆర్​ చాటుకున్నారని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ వెల్లడించారు. దేశంలోనే అధికంగా వేతనాలు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.

తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్​లో నూతనంగా నియామకమైన 60మందికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీఎస్ సోమేశ్ కుమార్ నియామక పత్రాలు అందించారు. ఇప్పుడున్న 63మంది సిబ్బందికి మరో 60 మంది చేరడం వల్ల బెవరేజెస్ కార్పొరేషన్​కు ఎంతో లబ్ధి చేకూరుతుందని శ్రీనివాస్​ గౌడ్​ అభిప్రాయపడ్డారు.

ఆరున్నరేళ్ల వ్యవధిలోనే 73 శాతం వేతనాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్​కే దక్కుతుందని మంత్రి పేర్కొన్నారు. లాక్​డౌన్ వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో ఉద్యోగులకు జీతాలు పెంచిందని అన్నారు. ఉద్యోగులు నిబద్ధతతో, బాధ్యతాయుతంగా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు.

ఎమ్మెల్యే బూతులు వింటే చెవిలో రక్తం ఫిక్స్..!

నిరుద్యోగులకు శుభవార్త.. 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల..!

ఇక ఇసుక దోపిడీకి చెక్..పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్కెచ్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -