Tuesday, May 7, 2024
- Advertisement -

డిసెంబ‌ర్‌లో మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌….

- Advertisement -

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను ఎదుర్కోవ‌డానికి భారీ ప్ర‌ణాలిక‌లు ర‌చిస్తున్నారు. జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర‌కు వ‌స్తున్న స్పంద‌న‌ను చూసి బాబు జ‌గ‌న్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఎన్నిక‌ల‌ను ఎదుర్కోవ‌డానికి కొత్త క్య‌బినేట్‌ను సిద్దం చేస్తున్నారు. త్వ‌ర‌లోనె మ‌రో సారి కేబినేట్ ప్ర‌క్షాళ‌ న‌కు పూనుకున్న‌ట్లు తెలుస్తోంది.

మ‌రో వైపు ముంద‌స్తు ఎన్నిక‌ల వార్త‌ల నేప‌థ్యంలో ప్రభుత్వ కార్యక్రమాలను, పార్టీ వాణిని బలంగా వినిపించే వాళ్ళు క్యాబినెట్‌లో ఉండాల‌ని బాబు భావిస్తున్నారు. కేబినేట్ ప్ర‌క్షాళ‌న‌కు డిసెంబ‌ర్‌లో ముహూర్తం పెట్టిన‌ట్లు తెలుస్తోంది. అయితె ఈసారి కేబినేట్ విస్త‌ర‌ణ‌లో ఎవ‌రు ఉంటారో ఎవ‌రి ప‌ద‌వులు ఊడుతాయో మంత్రుల్లో ఆందోళ‌న నెల‌కొంది. విశ్వ‌నీయ స‌మాచారం ప్ర‌కారం బాబుకు రైట్ హ్యాండ్‌గా ఉన్న మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడును త‌ప్పించే సూచ‌న‌లు బ‌లంగా వ‌నిపిస్తున్నాయి. కీల‌క‌మైన ఆర్థిక‌శాఖ‌కు మంత్రిగా ఉన్న చురుగ్గా వ్య‌వ‌హ‌రించ‌లేక‌పోతున్నారు. కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల టైంలోను, అసెంబ్లీలో త‌న శాఖ విష‌యంలోను నిర్ల‌ప్త‌తో ఉండ‌డంతో బాబు అసంతృప్తితో ఉంటున్నార‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. ఆర్థిక శాఖ‌ను త‌ప్పించి వ‌చ్చే సంవ‌త్స‌రంలో రాజ్య‌స‌భ‌కు పంపే ఏర్పాట్లు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం.

కొత్త కేబినేట్‌లో య‌న‌మ‌ల‌కు బ‌దులుగా పార్టీలో ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్యేగా ఉన్న ఓ వ్య‌క్తికి కేబినెట్‌లో చోటు ద‌క్క‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. గ‌తేడాదిలో పార్టీ ఫిరాయించిన నేత‌లు మంత్రి ప‌ద‌వుల్లో కొన‌సాగుతున్నారు. ఈసారి కేబినేట్ ప్ర‌క్షా ళ‌న‌లో సీమ‌జిల్లాల‌కు చెందిన ఓ జూనియ‌ర్ మంత్రితో పాటు గోదావ‌రి జిల్లాల‌కు చెందిన ఓ మంత్రి ప‌నితీరుపై బాబు అసంతృప్తితో ఉన్న‌ట్టు తెలుస్తోంది. వారి స్థానంలో పార్టీ వానిని ప్ర‌జ‌ల్లో బ‌లంగా తీసుకెల్లే వాల్ల‌ను తీసుకోనున్నారు.

ప్ర‌కాశం జిల్లాకు చెందిన ఓ ఫిరాయింపు ఎమ్మెల్యేకి మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్క‌వ‌చ్చ‌నె ప్ర‌చారం జ‌రుగుతోంది. స‌ద‌రు నేత‌ల‌కు లోకేష్ ఆశీసులు పుస్క‌లంగా ఉన్నాట్లు తెలుస్తోంది. జ‌గ‌న్‌ను ఎదుర్కొనేందుకు కేబినేట్‌లో మార్పులు చేసి చంద్రబాబు భారీగా రాజకీయ ప్రయోజనం ఉండాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -