Wednesday, May 8, 2024
- Advertisement -

బాబు టికెట్ ఆఫర్ చేసినా నో చెప్పి వైకాపాలో చేరుతున్న సీనియర్ నేత

- Advertisement -

తన సొంత బంధువును కూడా కాదని చెప్పి ఆ నేతకు కాంగ్రెస్ టికెట్ ఇప్పించాడు వైఎస్. వైఎస్ చనిపోయిన తర్వాత నుంచీ ఆ నాయకుడి రాజకీయ పయనం రకరకాల మలుపులు తిరిగింది. ఆరు సార్లు ఎమ్మెల్యేగా మైదుకూరు నుంచి గెలిచాడు. మంత్రిగా చేశాడు. 2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థికి సపోర్ట్ చేశాడు. ఆ తర్వాత చంద్ర బాబు అసలు రంగులు చూసి రాజకీయాలకే దూరంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్న సందర్భంలో ఆ సీనియర్ నేత డిఎల్ రవీంద్రారెడ్డికి అసెంబ్లీ టికెట్ ఆఫర్ చేశాడు చంద్రబాబు. జగన్ పార్టీలో ఎక్కడ చేరతాడో అన్న భయంతో చాలా ఆఫర్స్ ఎరచూపాడు.

అయితే డీఎల్ మాత్రం చంద్రబాబును నమ్మలేకపోయాడు. ఎన్నికలు దగ్గరపడ్డప్పుడు బాబు నైజం నాయకుల విషయంలో అయినా, ప్రజల విషయంలో అయినా ఇలానే ఉంటుందని……..ఎన్నికల్లో గెలిచిన వెంటనే చంద్రబాబులోని అపరిచితుడు బయటికి వచ్చి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తాడని సన్నిహితుల దగ్గర వాపోయాడు. వాడుకుని వదిలేసే చంద్రబాబును మరోసారి నమ్మితే అంతకుమించిన తప్పు వేరే ఏమీ ఉండదని తన సహచర నాయకులకు చెప్పాడు. ఇదే సందర్భంలో డిఎల్ రవీంద్రారెడ్డి అనుచరులు కూడా చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని…..జగన్ వెంట నడుద్దామని చెప్పారు. అదే సమయంలో వైకాపా నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డిలు డిఎల్ ని కలిశారు. తన తండ్రికి అత్యంత సన్నిహితుడు అయిన డిఎల్ రవీంద్రారెడ్డి అన్న పార్టీలోకి వస్తే సంతోషమేనన్న జగన్ మాటలను డిఎల్ కి చేరవేశారు. త్వరలోనే డిఎల్ వైకాపాలో చేరడం ఖాయం అయింది. అయితే అధికార పార్టీ టికెట్ ఆఫర్ చేసినప్పటికీ, చంద్రబాబు ఎన్నో ఆశలు పెట్టినప్పటికీ డిఎల్ మాత్రం ప్రతిపక్ష వైకాపాలో చేరుతుండడం, చంద్రబాబును నమ్మలేం…….వైఎస్ లను నమ్మొచ్చు అని వ్యాఖ్యలు చేయడం మాత్రం చంద్రబాబు-వైఎస్ ల మధ్య వ్యత్యాసాన్ని తెలియచేస్తోంది. అలాగే 2019లో ఎట్టి పరిస్థితిల్లోనూ వైకాపానే గెలుస్తుందన్న సీనియర్ నాయకుల విశ్లేషణలతో డిఎల్ రవీంద్రారెడ్డి కూడా ఏకీభవిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -