Thursday, April 25, 2024
- Advertisement -

అట్టెట్టా.. అచ్చెన్నాయుడు!

- Advertisement -

ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు స‌ఫలం కాక‌పోయినా ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యం తీసుకున్న ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ త‌గిలిన విష‌యం తెలిసిందే. గ్రామ పంచాయ‌తి ఎన్నిక‌ల‌కు జారీ చేసిన‌ షెడ్యూల్ను కోర్టు ర‌ద్దు చేసింది. ఏపీ ప్ర‌భుత్వం పిటిష‌న్‌ను సోమ‌వారం విచారించి ఈ నిర్ణ‌యం తీసుకుంది. అయితే నిమ్మ‌గ‌డ్డ ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హరించి రాజ‌కీయ దురుద్దేశంతోనే క‌రోనా కాలంలో ప్ర‌జల ప్రాణాలు ప‌ణంగా పెట్టేందుకు సిద్ధ‌ప‌డ్డార‌ని అధికార పార్టీ నేత‌ల ప్ర‌ధాన ఆరోప‌ణ‌. టీడీపీకి అనుకూలంగా ఆయ‌న ఉంటున్నార‌ని ఆది నుంచి ఆరోపణ‌లు వినిపిస్తున్నాయి. ఇక హైకోర్టు నిర్ణ‌యంపై టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడి స్పందించిన విధానం చూస్తుంటే ఇదే నిజ‌మేనేమో అనిపిస్తోంది.

కోర్టు తీర్పును గౌర‌విస్తామ‌ని అంటూనే.. కోర్టుకు తప్పుడు సమాచారమిచ్చి ఎన్నికలను అడ్డుకున్నారని ఆయ‌న విమర్శించ‌డం విశేషం. ఇదొక కుట్ర అని, ఉద్యోగ సంఘాల‌ను కూడా క‌లిపార‌ని ఆరోపించారు. అంతేకాదు.. ప్రజల మద్దతుంటే ఎన్నికలంటే భయమెందుకు అని ప్రశ్నించడం మ‌రీ విచిత్రం. ఎందుకంటే తాము అధికారంలో ఉన్న‌పుడు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌కుండా.. ఇప్పుడు ఆ అంశంపై రాజ‌కీయం చేయ‌డంపై అంద‌రూ న‌వ్వుకుంటున్నారు.

వాస్త‌వానికి స్థానిక సంస్థ‌ల ప‌ద‌వీ కాలం గ‌డువు ముగియ‌గానే గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఎన్నిక‌లు జ‌రిపి ఉంటే… అస‌లు ఈ రోజు ఇంత‌టి ప‌రిస్తితి వ‌చ్చేది కాద‌ని అచ్చెన్నాయుడు గ్ర‌హించ‌క‌పోవ‌డం పట్ల విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. దీంతో.. త‌ల‌తిక్క‌గా మాట్లాడే పప్పు లోకేశ్‌ను ‌మించిపోయేలా ఉన్నాడ‌నిపిస్తోంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ వినిపిస్తోంది. ఇక హైకోర్టు తీర్పుపై చంద్ర‌బాబు నాయుడు, లోకేశ్ ఇంత‌వ‌ర‌కు స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ‌కు భారీ షాక్‌..!

కేటీఆర్ కేబినెట్‌లో ప‌ద‌వుల కోసం లొల్లి!

అర్వింద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ఐదుగురు సీఎంలు!

త‌లైవా రావా ప్లీజ్‌.. నా నిర్ణ‌యం ఇదే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -