Monday, April 29, 2024
- Advertisement -

ఏపి లో ఓట్ల లెక్కింపు ప్రారంభం.. గెలుపు ఎవరిదో..!

- Advertisement -

గుంటూరు – కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. గుంటూరు – కృష్ణా ఎమ్మెల్సీ ఓట్లను గుంటూరు ఏసీ కళాశాలలో… ఉభయ గోదావరి ఓట్లను కాకినాడ జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో లెక్కిస్తున్నారు.

ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపుకు 14 బృందాలు పనిచేస్తున్నాయి. ఈ నెల 14న జరిగిన ఎన్నికల్లో 93.06 శాతం పోలింగ్‌ జరిగింది. ఎమ్మెల్సీ స్థానం కోసం 19 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. మొత్తం 13,505 ఓట్లకు 12,556 ఓట్లు పోలయ్యాయి.

సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ భిన్నంగా ఉంటుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లు 50 శాతానికి పైగా వచ్చినవారు విజేత అవుతారు. ఎవరికీ 50 శాతం ఓట్లు రాకపోతే.. ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడతారు. అక్కడా ఫలితం తేలకపోతే తృతీయ ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. ఇలా చేయాల్సి వస్తే ఫలితం తేలేందుకు దాదాపు 24 గంటలు పట్టే అవకాశం ఉంది. అందుకోసం మూడు షిఫ్టుల్లో సిబ్బందిని పనిచేస్తారు.

మజ్జిగతో బోలెడు లాభాలు.. తెలిస్తే అస్సలు వదలరు !

నాగార్జున‌కు కాజ‌ల్ గ్రీన్‌సిగ్న‌ల్ !‌

గుండె సమస్యలకు ఈ మూడే కారణాలట..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -