Friday, March 29, 2024
- Advertisement -

పాదయాత్రలతో సై అంటున్న కాంగ్రెస్, బీజేపీ !

- Advertisement -

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు ఏదో ఒక రకంగా ప్రజల్లో ఉండేందుకే మొగ్గు చూపుతున్నారు. వచ్చే ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అధికార టి‌ఆర్‌ఎస్ పార్టీకి చెక్ పెట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విశ్వ ప్రయత్నలే చేస్తున్నాయి. అందులో భాగంగానే బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్ళేందుకు పాదయాత్ర చేపట్టనున్నారు. ఇప్పటికే రెండు సార్లు ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టిన బండి సంజయ్ ఇక మూడవ సారి కూడా యాత్ర విజయవంతం చేయాలని చూస్తున్నారు.

ఇక కాంగ్రెస్ విషయానికొస్తే.. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పాదయాత్ర చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. దీంతో తెలంగాణలో ఈ పాదయాత్రల అంశం హాట్ టాపిక్ గా నిలుస్తోంది. అయితే అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా పాదయాత్రల ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెల్లే ప్రయత్నం చేయబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆ విధంగా ప్రతిపక్ష పార్టీలు నిత్యం ప్రజల్లో ఉంటూ వచ్చే ఎన్నికలకు సిద్దమౌతుంటే.. అధికార పార్టీ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇక రాబోయే రోజుల్లో టి‌ఆర్‌ఎస్ కూడా ప్రజల్లోకి వెళ్ళేందుకు క్యాంపెయినింగ్ మొదలు పెట్టె అవకాశం లేకపోలేదు.

అయితే అధికార పార్టీ అధినేత కే‌సి‌ఆర్ కూడా రాబోయే రోజుల్లో పాదయాత్ర చేపడతారా ? అనేది ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతున్న ప్రశ్న. ప్రస్తుతం కే‌సి‌ఆర్ జాతీయ రాజకీయాలపై గట్టిగా ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల కోసం తెలంగాణలో ఎలాంటి క్యాంపెనింగ్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనప్పటికి ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు చేపట్టబోతున్న పాదయాత్రలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. మరి ఈ పాదయాత్రలు ఆ పార్టీలకు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాలి.

Also Read

మోడీ సర్కార్ పై కాలు దువ్వుతోన్న జగన్ ?

ఆ విషయంలో.. మాట తప్పిన మోడీ !

దేశంలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -