Friday, May 3, 2024
- Advertisement -

చంద్రబాబు కు అంత సీన్ ఉందా..?

- Advertisement -

రాష్ర రాజకీయాలను చాల సంవత్సరాలు శాసించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు శాసింప బడే స్థాయికి దిగజారిపోయింది. నలభై ఏళ్ళు అనుభవం ఉన్నా కూడా జగన్ లాంటి ఓ కుర్రాడి చేతిలో చంద్రబాబు ఓడిపోవడం టీడీపీ వర్గం వారు జీర్ణించు కోలేకపోతున్నారు.. అందుకు తగ్గట్లే పార్టీ పరిస్థితి కూడా ఎంతో దయనీయంగా ఉంది.. చాలా పెద్ద అసెంబ్లీ నియోజక వర్గాలున్న రాష్ట్రం గా దేశంలో నే పేరున్న ఏపీ లో కేవలం ౨౩ మందిని గెల్చుకోవడం అంటే చాలా దిగజారిపోయిన పరిస్తితి.. అయితే ఇది వారి ని ఎంతగా దేబ్బకోట్టిందంటే భవిష్యత్ లో కోలుకోలేనంతగా కొట్టింది..

ఇప్పటికీ టీడీపీ నేతలు ఇళ్ళను వీడి రావట్లేదు అంటే ఏ రేంజ్ లో వారిని ఓటమి పలకరించిందో అర్థం చేసుకోవచ్చు.. పోనీ ఓడిపాయమని కాం గా ఉన్నారా చంద్రబాబు అంటే అదీ లేదు. ప్రభుత్వం పై లేని పోనీ విమర్శలు చేస్తూ స్వయంగా అభాసుపాలు అవుతునారు.. దీనితో ప్రభుత్వానికి ప్రతిపక్షాన్ని విమర్శించే పనిలేకుండా చేస్తున్నారు.. సరే ఎలాగు ఓడిపోయాము పార్టీ ని బలోపేతం దిశగా ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు కు టీడీపీ నేతలనుంచి ఎలాంటి సపోర్ట్ రాకపోవడం ఆయనను మరింత క్రుంగ తీసింది..

జగన్ అవినీతి పరులను జైలుకి పంపిస్తుండడంతో అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడిన టీడీపీ నేతలు ఎక్కడ తమమీదకోస్తాడో అని ప్రభుత్వం వ్యతిరేక చర్యలకు పాల్పడట్లేదు.. పోనీ ఆన్ లైన్ ద్వారా ప్రసన్నం చేసుకోవాలనుకున్నా చంద్రబాబు కు లీడర్ ల గ్రీన్ సిగ్నల్స్ అందడం లేదట.. తాజాగా చంద్రబాబు ‘పసుపు చైతన్యం పేరుతో 100 రోజుల కార్యక్రమాలకు శ్రీ‌కారం చుట్టగా ఈ కార్యక్రమ తో పోయిన పార్టీ కార్యకర్తలని తిరిగి తెచ్చుకోవాలని భావిస్తున్నారట.. చంద్రబాబు చేపట్టిన ఈ చర్య తో టీడీపీ శ్రేణుల్లో కొంత ఉత్సాహం నెలకొందట.. ఇన్నాళ్ళు పార్టీ కార్యకలాపాల్లో లేని వారంతా ఇప్పటినుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని నిశ్చయిన్చుకున్నారట. మరి చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం ‘పసుపు చైతన్యం’ పసుపు దళాల్లో చైతన్యం నింపుతుందా చూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -