Thursday, May 2, 2024
- Advertisement -

ఈటెల మళ్ళీ టి‌ఆర్‌ఎస్ లోకి.. బిజెపికి గట్టి దెబ్బే ?

- Advertisement -

టి‌ఆర్‌ఎస్ పార్టీలో ఒకప్పుడు బలమైన నేతగా ఈటెల రాజేందర్ కు స్థిరమైన గుర్తింపు ఉండేది. తెలంగాణ రాష్ట్ర పోరాటంతో పాటు టి‌ఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం మొదలుకొని ఈటెల క్రియాశీలక పాత్ర పోసిస్తూ వచ్చారు. ఫలితంగా 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత..టి‌ఆర్‌ఎస్ అధికారం చేపట్టగా ఈటెల రాజేంద్ర పలు శాఖలకు మంత్రిగా విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. 2018 ఎన్నికల్లో కూడా టి‌ఆర్‌ఎస్ మళ్ళీ విజయం సాధించిన తరువాత కూడా ఈటెల ఆరోగ్య శాఖ మంత్రిగా కొనసాగారు. అయితే ఆయనపై భూ కబ్జాల విషయంలో తీవ్రమైన ఆరోపణలు రావడంతో కే‌సి‌ఆర్ ఈటెలను మంత్రి పదవి నుంచి తప్పించడం, పార్టీ నుంచి ఈటెల బయటకు వెళ్లిపోవడం అన్నీ చక చక జరిగిపోయాయి. .

ఇక టి‌ఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చిన తరువాత తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ గూటికి చేరారు ఈటెల. దాంతో హుజరాబాద్ ఉపఎన్నిక అనివార్యం కాగా.. ఆ బైపోల్ లో టి‌ఆర్‌ఎస్ అభ్యర్థి పై ఈటెల రాజేందర్ ఘనవిజయం సాధించారు. అయితే బీజేపీ తరుపున ఈటెల గెలిచినప్పటికి.. ఆయనకు సరైన ప్రదాన్యం ఇవ్వడం లేదని ఎన్నో రోజులుగా వార్తలు వినిపించాయి. ఆ నేపథ్యంలో ఆయనను చేరికల కమిటీ చైర్మెన్ గా నియమించిది బీజేపీ అధిష్టానం. అయినప్పటికి ఆ పదవితో ఈటెల సంతృప్తి లేరనే వాదన కూడా గట్టిగానే వినిపించింది. ఆయన కే‌సి‌ఆర్ ను ఢీ కొట్టేందుకు స్టార్ క్యాంపైనర్ హోదా ఆశించారని, కానీ బీజేపీ అధిష్టానం మాత్రం పట్టించుకేలేదట.

దాంతో బీజేపీ అధిష్టానం వైఖరి పట్ల ఈటెల లోలోపల కొంత అసంతృప్తి గానే ఉన్నారట. ఇక మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో కూడా ఈటెల చేరికల కమిటీ చైర్మెన్ గా ఉన్నప్పటికి.. ఇతర పార్టీల నేతలను ఆకర్షించడంలో పెద్దగా ప్రభావం చూపలేదనే చెప్పాలి. భారీ ఎత్తున చేరికలు ఉండబోతున్నాయని ఈటెల చాలా సార్లు చెప్పుకోస్తున్నప్పటికి.. అలాంటి పరిణామాలేవనేది పోలిటికల్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న మాట. ఇదిలా ఉంచితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈటెల మళ్ళీ టి‌ఆర్‌ఎస్ వైపు చూస్తున్నాడట. ఇదే విషయాపై పలు పత్రికల్లో కథనాలు కూడా వెలువడ్డాయి. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ రైజింగ్ పార్టీ గా రోజురోజులు పరిధిని పెంచుకుంటోంది. ఈ నేపథ్యం వచ్చే ఎన్నికల్లో టి‌ఆర్‌ఎస్, బీజేపీ మద్య నువ్వా నేనా అనట్లు పోటీ ఉండడం ఖాయమే.

ఈ నేపథ్యంలో బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకు కే‌సి‌ఆర్ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీలోని కీలక నేతలను టి‌ఆర్‌ఎస్ వైపు చూచేలా కే‌సి‌ఆర్ ప్రణాళికలు సిద్దం చేస్తున్నాడట. ఆ మద్య కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరిన దాసోజు శ్రవణ్.. ఊహించని విధంగా పార్టీలో చేరిన కొద్ది రోజులకే కమలానికి బై బై చెప్పి టి‌ఆర్‌ఎస్ గూటికి చేరారు. ఇప్పుడు ఈటెల ను కూడా తిరిగి టి‌ఆర్‌ఎస్ లో కలుపుకునేందుకు కే‌సి‌ఆర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయ వర్గల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ ఈటెల తిరిగి టి‌ఆర్‌ఎస్ గూటికి చేరితే ఆయనకు డిప్యూటీ సి‌ఎం పదవి అప్పటించేందుకు కూడా కే‌సి‌ఆర్ సిద్దంగా ఉన్నరనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీలో పెద్దగా ప్రాధాన్యం లేనందువల్ల ఒకవేళ ఈటెల రాజేంద్ర మళ్ళీ టి‌ఆర్‌ఎస్ గూటికి చేరితే.. బీజేపీ కోలుకోలేని దెబ్బ తినడం ఖాయం. మరి రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చెప్పడం కష్టం కనుక.. ఈటెల బీజేపీ లోనే కొనసాగుతారా ? లేదా మళ్ళీ టి‌ఆర్‌ఎస్ వైపు చూస్తారా ? అనేది కాలమే నిర్ణయించాలి.

ఇవి కూడా చదవండి

ఏపీపై మోడీకి నమ్మకం లేదా..అసలెందుకు ?

జగన్ ధీమా అదే.. అందుకే పొత్తులకు నో ఛాన్స్ !

కుప్పంలో జగన్.. పులివెందులలో బాబు.. నిలిచి గెలిచేదెవ్వరు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -