Saturday, April 27, 2024
- Advertisement -

యశోద ఆస్పత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్!

- Advertisement -

తెలంగాణ లో కరోనా వైరస్ ఏ విధంగా కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఒక్కరోజే ఆరు వేల కేసుల వరకు నమోదు అయ్యాయి. ఇక కరోనా ధాటికి సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా రాజకీయ నేతలను కరోనా పట్టి పీడిస్తుంది.. ఈ మద్య ఎన్నికల నేపథ్యంలో ప్రచారాలు, సభలు నిర్వహించిన వారికి కరోనా వైరస్ సోకుతుంది. ఇటీవల సాగర్ లో జరిగిన ఉప ఎన్నికల నేపథ్యంలో సభలు, ప్రచారాలు నిర్వహించిన వారికి కరోనా సోకింది.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా కరోనా భారిన పడ్డ విషయం తెలిసిందే. కరోనా బారిన పడిన తెలంగాణ సీఎం కేసీఆర్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లనున్నారు. సాధారణ హెల్త్ చెకప్‌ తో పాటు, కేసీఆర్‌ కు సిటీ స్కాన్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వైద్య పరీక్షల అనంతరం కేసీఆర్ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌ హౌస్‌‌ కు వెళ్లనున్నారు.

కరోనాకు సంబంధించిన స్వల్ప లక్షణాలతో కేసీఆర్ కొద్ది రోజులుగా ఫామ్‌ హౌస్‌ ‌లో ఐసోలేషన్‌లో ఉన్నారు. జ్వరం, జలుబు లక్షణాలు కనిపించడంతో సీఎం కేసీఆర్‌కు రాపిడ్ టెస్టులు చేశామని, కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పారు. ఫామ్ హౌస్‌ లో కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారన్నారు. ఒక వైద్య బృందం కేసీఆర్‌ ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షిస్తోందని డాక్టర్ ఎమ్‌వీ రావు తెలిపారు.

కరోనా ఎఫెక్ట్ : సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ రిలీజ్ వాయిదా?

క్వీన్​ కంగనాకు కోపం వచ్చింది.. ఎందుకో తెలుసా?

కరోనా విషాదం.. ఆక్సిజన్ ట్యాంక్ లీకై 22 మంది మృతి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -