Friday, April 26, 2024
- Advertisement -

షర్మిల దీక్ష భగ్నం… స్వల్ప గాయాలు… నాపై ఇంకో సారి చెయ్యి పడితే కబర్దార్…

- Advertisement -

తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసేందుకు నిశ్చయించుకున్న వైఎస్ షర్మిల నేడు ఉద్యోగ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ దగ్గర వైఎస్‌ షర్మిల దీక్షను ప్రారంభించారు.తెలంగాణ‌లో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. లంగాణ నిరుద్యోగులు ఉపాధి లేక  ఆత్మహత్యలకు పాల్పడటం కలవరపెడుతున్నాయన్నారు. అయితే షర్మిల నిరాహార దీక్ష చేపట్టబోతున్న విషయం ఇటీవల ఖమ్మం మహాసభలోనే వెల్లడించారు.

ఈ నేపథ్హైంలో హైదరాబాదు ఇందిరా పార్క్ వద్ద ఆమె 72 గంటల దీక్ష చేపట్టగా, ఒక్క రోజు దీక్షకే అనుమతి ఉందని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె దీక్ష 5 గంటల వరకే పరిమిషన్ ఉందని.. ఆ తర్వాత ఆమెను అక్కడ్నించి తరలించే ప్రయత్నం చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ ధర్నా చౌక్ నుంచి పాదయాత్రగా లోటస్ పాండ్ కు తరలి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్ద అడ్డుకున్నారు.

ఈ క్రమంలోనే పోలీసులకు, షర్మిలకు మద్య వాగ్వాదం చోటు చేసుకోవడం.. అడ్డుకునే సమయంలో స్వల్ప గాయాలు కావడం.. సొమ్మసిల్లడం జరిగింది. ఈ సందర్భంగా షర్మిల స్పందిస్తూ, పోలీసులు ఎక్కడికి తరలించినా అక్కడే దీక్ష చేస్తానని స్పష్టం చేశారు. షర్మిల పాదయాత్రతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడడంతో పోలీసులు ఆమెను వాహనంలో అక్కడ్నించి తరలించారు.

ఏపీలో కొత్తగా 5వేల మందికి కరోనా

శ్రీరెడ్డి.. నవాబుల కాలం నాటి చేపల పులుసు..

క‌రోనాతో కాంగ్రెస్ అభ్య‌ర్థి మృతి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -