Thursday, May 9, 2024
- Advertisement -

నేదురుమల్లి కుటుంబంతో పాటు ఆ మాజీ కేంద్ర మంత్రి కూడా వైకాపాలోకే….. భారీ చేరికలు

- Advertisement -

వైకాపాలోకి ఒక జిల్లా మొత్తం స్వీప్ చేసే స్థాయి చేరికలు షురూ అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాలను ప్రభావితం చేసిన మాజీ ముఖ్యమంత్రి కుటుంబం మొత్తం త్వరలోనే వైకాపాలో చేరనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ ముఖ్యమంత్రి కుమారుడే చెప్పుకొచ్చాడు. తెలుగు ప్రజలకు నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నెల్లూరు జిల్లా మొత్తాన్ని ప్రభావితం చేసేస్థాయి ప్రజాదరణ ఉన్న నాయకుడు. నెల్లూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయిన నాయకుడు. ఆయన భార్య నేదురుమల్లి రాజ్యలక్ష్మి కూడా వైఎస్ కేబినెట్‌లో మంత్రిగా చేశారు. ఇక మాజీ కేంత్రమంత్రి పనబాక లక్ష్మి కూడా త్వరలో వైకాపాలో చేరనున్నారు.

కార్యకర్తలతో సమావేశమైన నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి త్వరలో ఏ పార్టీలో చేరేది స్పష్టం చేస్తానని చెప్పడంతోనే కార్యకర్తలందరూ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. జనార్థన్‌రెడ్డి కుమారుడు కూడా నవ్వుతూ కార్యకర్తలను ప్రోత్సహించాడు. వైకాపా నెల్లూరు నాయకుడు మేరుగు మురళీధర్‌తో కూడా చర్చలు జరిపిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి త్వరలోనే నేదురుమల్లి కుటుంబం మొత్తం వైకాపాలో చేరుతామని ప్రకటించాడు. ఇక నేదురుమల్లి కుటుంబానికి అత్యంత సన్నిహితులైన మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి, ఆమె భర్త కృష్ణయ్య కూడా త్వరలోనే వైకాపాలో చేరనున్నారు. ఈ భారీ చేరికలతో నెల్లూరు జిల్లాలో ఆల్రెడీ టిడిపి కంటే బలంగా ఉన్న వైకాపా…….వచ్చే 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో పూర్తిగా స్వీప్ చేయడం ఖాయం అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నేదురుమల్లి కుటుంబం చేరిక వార్తలతో వైకాపా శ్రేణుల్లో అమితోత్సాహం వ్యక్తమవుతుంటే మరోవైపు టిడిపి శ్రేణులు మాత్రం పూర్తిగా డీలాపడ్డాయి. వరుసగా జరుగుతున్న రాజకీయ పరిణామాలతో 2019 ఎన్నికల్లో గెలుపు ఆశలు రోజు రోజుకూ సన్నగిల్లుతుండడంతో టిడిపి బ్యాచ్‌లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -