Thursday, May 2, 2024
- Advertisement -

సొంత గూటికి చేరుకున్న వైసీపీ నేత‌..

- Advertisement -

చంద్ర‌బాబు చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్శ‌న‌లో భాగంగా వైసీపీ నుంచి టీడీపీకీ ఫిరాయించిన నేత‌లు సొంత‌గూటికి చేరుకుంటున్నారు. జ‌గ‌న్ పాద‌యాత్ర అనంత‌పురం జిల్లాలోకి ప్ర‌వేశించే స‌మ‌యంలో షాక్ ఇవ్వాల‌ని వైసీపీ నేత గురునాధ్‌రెడ్డిని టీడీపీ పార్టీలోకి చేర్చుకున్నారు బాబు. అయితే ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయ్యింది. తాజాగా ఆయ‌న మ‌ళ్లీ వైసీపీ కండువా క‌ప్పుకున్నారు.ఆయ‌న‌తో పాటు పలువురు సీనియర్ నేతలు సైతం వైసీపీ గూటికి చేరారు.

ప్ర‌స్తుతం పాశ్రీకాకుళం జిల్లాలో పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్‌ను క‌లిశారు. అనంత‌రం ఆయన సమక్షంలో గురునాథ్‌రెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా గురునాథ్‌రెడ్డికి పార్టీ కండువా కప్పి.. వైఎస్‌ జగన్‌ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సంద‌ర్భంగా బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

చిన్న పొరపాటుతో అనాడు రాజకీయ భిక్ష పెట్టిన దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబాన్ని వదులుకోవాల్సి వచ్చిందని ప్రశ్చాత్తాపం చెందారు. రాష్ట్ర అభివృద్ధిపై బాబు చిత్త శుద్ది లేద‌న్నారు.రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకోవడం నచ్చకనే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు గురునాథ్‌రెడ్డి తెలిపారు.

రాష్ట్రం అభివృద్ధితోపాటు జిల్లా అభివృద్ధి చెందుతుందన్న ఆశతోనే ఆనాడు తాను టీడీపీలో చేరాను తప్ప…తన స్వప్రయోజనాలు, పదవులను ఆశించి పోలేదని ఆయన వివరణ ఇచ్చారు. ఈ ఐదేళ్ల పాల‌న‌లో బాబు రాష్ట్రానికి చేసిదేమిలేద‌ని…సొంత అజెండానే అభివృద్దిగా పని చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. హంద్రీ నీవా కాలువ ద్వారా కృష్ణా నీటితో కరువు జిల్లాకు సాగునీరు అందిస్తారనుకుంటే అరకొరగా చెరువులు నింపడం తప్పితే ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వలేదని గురునాథ్ రెడ్డి ఆరోపించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -