Monday, April 29, 2024
- Advertisement -

జ‌గ‌న్ కేబినేట్‌లో ఉండ‌వ‌ల్లికి చోటు

- Advertisement -

ఏపీలో ఎన్నిక‌ల ఫ‌లితాలు రాక‌ముందె రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. ఎప్పుడు ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో? అన్న విషయం ఎవరికి అంతుపట్టడం లేదు. అన్ని స‌ర్వేలు జ‌గ‌న్‌కే అనుకూలంగా ఉండ‌టంతో ప‌లు రాజ‌కీయా పార్టీల నాయ‌కులు జ‌గ‌న్‌తో ట‌చ్‌లోకి వెల్తున్నారు. ఇద‌లా ఉంటె ఇప్పుడు మ‌రో వార్త ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి కుమార్ వైసీపీలో చేరుతున్నార‌నె ప్ర‌చారం రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.జగన్ ఉండవల్లిని వైసీపీలోకి రావాలని ఆహ్వానించారా? అంటే మాత్రం ఈ ప్రశ్నలకు
అవుననే సమాధానం వస్తోంది. ఎందుకంటే ఉండవల్లి అరుణ కుమార్ రాజకీయాల్లో తలపండిన నేత. మొద‌టినుంచి చంద్ర‌బాబు అవినీతిపై నిరంత‌రం పోరాడుతున్న నాయ‌కుడు.

విభ‌జ‌న త‌ర్వాత ఉండ‌వ‌ల్లి రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. పోలింగ్ త‌ర్వాత జ‌గన్ గెలుస్తారంటూ కూడా ఉండవల్లి జోస్యం చెప్పారు. అటు చంద్రబాబుపై కూడా గత కొంతకాలంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇలాంటి తరుణంలో తన పార్టీలో ఉండవల్లి లాంటి సీనియర్ నేతలు ఉంటే పార్టీకి కూడా ఎంతో మేలు జరుగుతుందని జగన్ భావిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వ‌స్తె కేబినేట్‌లో చేరాలని జగన్ ఉండవల్లిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. జగన్ ఆహ్వానానికి అటు ఉండవల్లి కూడా సూత్రప్రాయంగా ఓకే అన్నట్లు సమాచారం. ప్ర‌తిప‌క్షంగా ఉండె చంద్ర‌బాబును ఎదుర్కోవాలంటె అనుభం ఉన్న నేత‌లు కావాలి అందుకే ఉండ‌వ‌ల్లికి జ‌గ‌న్ బంఫ‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -