Friday, March 29, 2024
- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఓట్ల లెక్కింపు..!

- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ నెల 1న ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగా, నేడు లెక్కింపునకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8 గంటలకు బ్యాలెట్ బాక్సులను తెరుస్తారు. 11 గంటల తర్వాత తొలి రౌండ్ ఫలితం వచ్చే అవకాశం కౌంటింగ్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు ఒకొక్కరుగా సిబ్బంది చేరుకుంటున్నారు.

ఒక్కో రౌండ్‌లో 14 వేట్ల ఓట్లను లెక్కిస్తామని తెలిపింది. ఓట్ల లెక్కింపుకోసం 150 డివిజన్లలో 30 కేంద్రాలను ఏర్పాటుచేశారు. రెండు దశల్లో బ్యాలెట్‌ బాక్సుల్లోని ఓట్లను లెక్కించనున్నారు. మొదట బాక్సుల్లోని ఓట్లను ప్రాథమికంగా లెక్కిస్తామని, తర్వాత అభ్యర్థుల వారీగా మరోసారి వివరణాత్మక లెక్కింపు జరుగుతుందని ఎస్‌ఈసీ తెలిపింది.

మధ్యాహ్నం 12 గంటల్లోపు ప్రాథమిక లెక్కింపు పూర్తవుతుందని, వివరణాత్మక లెక్కింపు మధ్యాహ్నం 3 గంటల్లోపు పూర్తవుతుందని వెల్లడించింది. ఒక్కో రౌండ్‌లో 14 వేట్ల ఓట్లను లెక్కిస్తామని తెలిపింది. చాలా డివిజన్లలో ఓటింగ్ శాతం భారీగా తగ్గడంతో రెండు రౌండ్లలోనే పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే మూడు రౌండ్లలోనే ఫలితం తేలిపోనుంది. కరోనా వైరస్ నేపథ్యంలో లెక్కింపు కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -