Monday, April 29, 2024
- Advertisement -

మినీ పోరు ఓట్ల లెక్కింపు ప్రారంభం..

- Advertisement -

కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా మినీ పురపోరు ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లతోపాటు నకిరేకల్, కొత్తూర్, జడ్చర్ల, అచ్చంపేట, సిద్దిపేట మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం గంటలకు ప్రారంభం అయ్యాయి. లెక్కింపునకు హాజరయ్యే వారందరికీ ప్రత్యేకంగా కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. అధికారులు, పోలీసులు, మీడియా ప్రతినిధులు, ఏజెంట్లకు ఒకరోజు ముందుగానే లెక్కింపు కేంద్రం ప్రాంగణంలో కొవిడ్ పరీక్షలు చేశారు.

ఈ ఎన్నికలను బ్యాలెట్ పత్రాలతో నిర్వహించడంతో ఫలితాల వెల్లడి ఆలస్యమయ్యే అవకాశం ఉంది. రెండు పెద్ద నగరాలు, ఐదు పట్టణాల్లో ఏ పార్టీ పాగా వేస్తుందని ఆసక్తి రేపుతోంది. గ్రేటర్ వరంగల్ కు సంబంధించి 66 డివిజన్లు ఉన్నాయి. మధ్యాహ్నం వరకు ఫలితాలు వెల్లడి కానున్నాయి.

కాగా, 60 డివిజన్లకు గాను ఇప్పటికే 10 డివిజన్లు టీఆర్ఎస్ ఏకగ్రీవం అయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ లోని లింగోజిగూడ, సహా వివిధ పట్టణాల్లో మిగిలిపోయిన వార్డులకు ఉపఎన్నికల ఫలితాలు ఈరోజు వెల్లడికానున్నాయి. ఇక ఐదు మున్సిపాలిటీల ఫలితాలు మధ్యాహ్నం 3 గంటలకు వెల్లడి కానున్నాయి.

2021 ఎన్నికల్లో సినీ నటులకు ఘోర పరాభవం!

నేటి పంచాంగం,సోమవారం (3-05-2021)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -