Friday, April 26, 2024
- Advertisement -

నాలుగు ఇడ్లీలకు రూ. 20, ఆలూ సమోసాకు రూ. 10.. ఎందుకో తెలుసా?

- Advertisement -

నగరంలో జీహెచ్ఎంసీ ఎన్నికల హీట్ మొదలైంది. ఈ రోజు చివరి నామినేషన్ల స్వీకరణ.. అభ్యర్థుల ప్రకటనలో పార్టీలు బిజీగా ఉన్నాయి. కాగా, గ్రేటర్ ఎన్నికల బరిలోకి దిగుతున్న అభ్యర్థులు చేసే ఖర్చు ఎలా ఉండాలన్నదానిపై జీహెచ్ఎంసీ నిన్న ఓ పట్టికను విడుదల చేసింది.  ఓటర్లను ప్రలోభ పెట్టే అవకాశం లేకుండా చేసే ప్రతి ఖర్చుకు ఓ ధరను నిర్ణయించారు. జీహెచ్ఎంసీ అధికారులు విడుదల చేసిన ధరల జాబితా ప్రకారం.. అభ్యర్థి వేసుకునే కండువాకు రూ. 20, మాస్కుకు రూ. 20 చొప్పున లెక్క కడతారు.

అలాగే, ప్రచారంలో భాగంగా అల్పాహారం తీసుకుంటే నాలుగు  ఇడ్లీలకు రూ. 20, నాలుగు వడలకు రూ. 20, ఆలూ సమోసా తింటే రూ. 10, ఇరానీ సమోసాకు రూ. 3 చొప్పున లెక్కిస్తారు. ఇదంతా పోటీ చేస్తున్న అభ్యర్థి లెక్కలోకి వస్తాయని తెలిపింది. టీ, కాఫీలకు రూ. 5 నుంచి రూ. 10, వాటర్ ప్యాకెట్‌కు రూపాయి, వాటర్ బాటిల్‌కు రూ. 20, 400 వాట్స్ లౌడ్ స్పీకర్లు రెండింటికి రూ. 3,850, ఐదుగురు కూర్చునే వేదిక నిర్మాణానికి రూ. 2,200, వస్త్రంతో చేసిన చిన్న జెండాకు రూ. 30, పెద్దదైతే రూ. 61గా ధరలను నిర్ణయించారు.

ఇక ప్రచారంలో ఉపయోగించే టాటా ఇండికా కారుకు రోజుకు డ్రైవరు బత్తాతో కలిపి రూ. 1200, 16 మంది వరకు కూర్చునే మాక్సీ క్యాబ్‌కు రూ. 1700, ఆటోకు రూ. 300, మినీ లారీకి రూ. 1700, బస్సుకు రూ. 3,900, ట్రాక్టరుకు రూ. 1400, మామూలు కుర్చీకి ఏడు రూపాయలుగా నిర్ణయించింది. ఏది ఏమైనా ప్రతి అభ్యర్థి ఖర్చు రూ. 5 లక్షలకు మించకూడదు.

సీమ ఎత్తిపోతల పథకాలకు బ్రేకులు వేసే కుట్రలు..!

చ‌దువు ‘కొన్న’ లోకేష్‌ కితకితలు

చంద్రబాబు ఎంత చెప్పిన ఈ ట్రిక్స్ ఆపడా..?

దుకుడు తగ్గించిన సోము వీర్రాజు కారణం ఎంటో..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -