Friday, April 26, 2024
- Advertisement -

పెట్రో డీజిల్ రేట్స్ కి నిరసనగా సైకిల్ మీద వచ్చి ఓటు వేసిన హీరో విజయ్!

- Advertisement -

దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్‌, అసోంలలో నేటి ఎన్నికల పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బెంగాల్‌, అసోంలో మూడో విడత ఎన్నికలు జరగనుండగా, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. వీటితో పాటు తమిళనాడులోని కన్యాకుమారి, కేరళలోని మలప్పురం లోక్‌సభ నియోజకవర్గాలకూ ఇవాళ పోలింగ్‌ జరగనుంది. 

ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు జరిగే ఈ ఎన్నికల్లో ఓటర్లు తమ తీర్పును ఈవీఎంల ద్వారా వెల్లడించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుంది. చివరి గంటలో ఓటు వేసేందుకు కరోనా బాధితులను అనుమతిస్తారు. ఈ ఎన్నికల్లో అనేక మంది సినీ సెలెబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

ఈ క్రమంలో హీరో విజయ్ కూడా ఓటు వేశారు. పాత మహాబలిపురం రోడ్డు, నీలాంకరైలో నివాసముండే హీరో విజయ్.. స్థానికంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అయితే హీరో విజయ్ ఇంటి నుంచి పోలింగ్ కేంద్రం వరకు సైకిల్‌పై వచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ప్రముఖ నటుడు సూర్య, అతని సోదరుడు, నటుడు కార్తీ, వారి తండ్రి, సీనియర్ నటుడు శివకుమార్ టి.నగరులోని పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ప్ర‌పంచంలోనే అతి ఎత్త‌యిన రైల్వే బ్రిడ్జ్‌.. భారతీయ రైల్వే చరిత్రలో కీలక ఘట్టం!

ముఖేష్ అంబానీ పిల్లల వాడే కార్ల గురించి తెలిస్తే ఔరా అంటారు!

రసవత్తరంగా కొనసాగుతున్న పోలింగ్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -