Friday, April 26, 2024
- Advertisement -

గవర్నర్ బండారు దత్తాత్రేయను నెట్టెసిన ఎమ్మెల్యేలు

- Advertisement -

ఈశాన్య భారత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ లో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఓ అనుచిత ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ సమావేశాల సందర్భంగా తన ప్రసంగాన్ని ముగించుకుని వెళ్తుండగా పలువురు ఎమ్మెల్యేలు ఆయనను నెట్టివేశారు.

ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ స్పందిస్తూ దీనిని ఖండించారు. ఈ ఘటనకు కారణమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని రాష్ట్ర బీజేపీ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు.. వారిని సస్పెండ్ చేయాలని తీర్మానం సైతం ప్రవేశపెట్టారు. దీంతో రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయతో అనుచితంగా ప్రవర్తించిన ఐదుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. కాగా, ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం పట్ల కాంగ్రెస్ స్పందిచిన కాంగ్రెస్.. ఈ చర్యలను ఖండిస్తూ అగ్రహం వ్యక్తం చేసింది.

రాష్ట్ర బడ్జెట్ సమావేశల నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీకి బండారు దత్తాత్రేయ విచ్చేశారు. సభ ప్రారంభం నుంచే కాంగ్రెస్ నేతలు నినాదులు చేయడం ప్రారంభింభించారు. పెరిగిన నిత్యవసరాల ధరలు, చమురు ధరలు, వంట నూనెల ధరలు వంటి అంశాలపై మాట్లాడాలని పట్టుబట్టారు. ఈ నెపథ్యంలోనే తన ప్రసంగం పూర్తయిందని పేర్కొటూ దత్తాత్రేయ వెళ్లిపోతున్న క్రమంలో పలువురు ఎమ్మెల్యేలు అనుచితంగా ప్రవర్తించారు.

షాదీ ముబారక్ అంటున్న దిల్ రాజు !

‘అన్నాతే’ షూటింగ్ లో సూప‌ర్ స్టార్ ర‌జినీ

సోష‌ల్ మీడియాపై కేంద్రం చ‌ర్య‌ల‌ను స‌మ‌ర్థించిన విజ‌య‌శాంతి

మ‌హా శివరాత్రికి పవన్ సినిమా ఫస్ట్ లుక్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -