పక్కా ప్లాన్ తోనే కిడ్నాప్ : సీపీ అంజనీ కుమార్

- Advertisement -

బోయిన్ పల్లి కిడ్నాప్ వివాదంలో పోలీసు దర్యాప్తు పురోగతిపై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, నార్త్ జోన్ డీసీపీ కమలేశ్వర్  మీడియా సమావేశం నిర్వహించారు.  ఈ కిడ్నాప్ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. ఇవాళ మరో 15 మందిని అరెస్ట్ చేసినట్టుగా ఆయన వివరించారు. బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసుకు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి, గుంటూరు శ్రీనులు ప్లాన్ చేశారని ఆయన చెప్పారు.

మాదాల సిద్ధార్థ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, ఈ కిడ్నాప్ కోసం సిద్ధార్థ్ 20 మంది మనుషులను పంపించాడని, ఓ స్విఫ్ట్ డిజైర్ కారును కూడా సమకూర్చాడని పోలీసులు తెలిపారు. ఈ కిడ్నాప్ కేసులో అఖిలప్రియ, భార్గవరామ్, గుంటూరు శ్రీను, జగత్ విఖ్యాత్ రెడ్డి కీలకం అని వివరించారు. ఈ నెల 2వ తేదీన లోథా అపార్ట్‌మెంట్ లో, ఈ నెల 4న భార్గవ్ రామ్ కుటుంబం నిర్వహించే స్కూల్ లో కిడ్నాప్ ప్లాన్ చేశారని ఆయన తెలిపారు.

- Advertisement -

యూసుఫ్ గూడలోనే నకిలీ పోలీసు దుస్తులు, ఐటీ అధికారుల దుస్తులు కొనుగోలు చేశారని వివరించారు. భార్గవరామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి పేర్లతో స్టాంప్ పేపర్లు కూడా సిద్ధంగా ఉంచుకున్నారని తెలిపారు. ఈ కిడ్నాప్ కోసం మొత్తం 5 వాహనాలు ఉపయోగించారని, వాటిలో ఒక వాహనానికి జగత్ విఖ్యాత్ రెడ్డి, మరో వాహనానికి మాదాల శ్రీను డ్రైవింగ్ చేశారని వెల్లడించారు. గుంటూరు శ్రీను ఇన్నోవా కారులో ప్రయాణించాడని తెలిపారు.

ఐస్​క్రీం​లోనూ కరోనా .. ఎవరు కొన్నరో వారికోసం జల్లెడ..!

జల్లికట్టు కి నిండు ప్రాణం బలి.. విషాదం లో కుటుంబ సభ్యులు..!

ఆచార్య క్రేజీ అప్‌డేట్‌..సిద్ధ వచ్చేశాడు.

విద్యా బాలన్ చిత్రానికి అరుదైన గౌరవం

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News