Friday, April 19, 2024
- Advertisement -

దుబ్బాకలో ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తున్న : మంత్రి హరీష్

- Advertisement -

ఈ రోజు తెలంగాణలో ప్రతిష్టాత్మంగా దుబ్బాకలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మొదటి నుంచి ఇక్కడ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా నడుస్తుంది. ఈ రోజు వెలువడ్డ ఫలితాల్లో మొదటి బిజెపి ఆదిక్యం కొనసాగిస్తు వచ్చింది. మద్యలో టీఆర్ఎస్ తన ఆదిక్యతన చాటుకుంటూ వచ్చినా.. చివర్లో మాత్రం బిజెపి తన ఆదిపత్యాన్ని పూర్తిగా చాటుకొని చారిత్రాత్మక గెలుపు పొందింది.  తాజాగా దుబ్బాక ఓటమిపై మంత్రి హరీశ్ రావు స్పందించారు.

ఈ ఓటమికి తనదే బాధ్యత అని చెప్పారు. దుబ్బాక ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామని అన్నారు. తమ పార్టీ ఓడిపోవడానికి గల కారణాలను సమీక్షిస్తామని, తప్పులను సరిదిద్దుకుంటామని చెప్పారు.

ఈ ఎన్నికలో ఓటమికి కారణాలు, మా లోపాలను పూర్తి స్థాయిలో సమీక్షించుకుంటామని మంత్రి పేర్కొన్నారు. దుబ్బాక ప్రజాసేవలో నిరంతరం పాటుపడతామన్నారు. ఓడినా దుబ్బాక ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామని మంత్రి హరీశ్ సూచించారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

క్యాన్సర్‍తో పోరాడి గెలిచిన సెలబ్రిటీలు వీరే..!

దేశంలోనే జ‌గ‌నన్న బెస్ట్ సీఎం..!

సీమ ఎత్తిపోతల పథకాలకు బ్రేకులు వేసే కుట్రలు..!

చ‌దువు ‘కొన్న’ లోకేష్‌ కితకితలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -