Monday, April 29, 2024
- Advertisement -

ముఖ్యమంత్రి కార్యాలయ ఐఎఎస్ అధికారులే కేంద్రానికి ఉప్పందించారా?

- Advertisement -

జాతీయస్థాయిలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, కేబినెట్‌లో ఉన్న నలుగురు మంత్రులపై సిబిఐ విచారణకు రంగం సిద్ధమవుతోంది. జాతీయ మీడియా నుంచీ సోషల్ మీడియా వరకూ ఈ వార్త హల్చల్ చేస్తోంది. ఇందులో ఇంకా పెద్ద విశేషం ఏంటంటే చంద్రబాబు, లోకేష్‌లతో సహా నలుగురు కేబినెట్ మంత్రులకు సంబంధించిన తప్పులు, అక్రమాల వ్యవహారాలన్నింటిపై కేంద్రప్రభుత్వానికి సమాచారం అందించింది ఎపి ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న నలుగురు ఐఎఎస్ అధికారులు.

సిబిఐ ఎంక్వైరీ, ఆ తర్వాత జైలుకు పంపడం లాంటి వ్యవహారాల్లో తమను మినహాయిస్తే మొత్తం సమాచారం ఇస్తామని వాళ్ళే కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నారట. అటువైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో రీసెంట్‌గా వేరే కార్యక్రమంపై ఢిల్లీ వెళ్ళిన ఒక ఐఎఎస్ అధికారి మొత్తం సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చాడట. ఈ విషయం గురించి కాస్త ఆలస్యంగా తెలుసుకున్న చంద్రబాబు ఇప్పుడు తనతో సహా మంత్రులందరి చేత కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయించడానికి రెడీ అవుతున్నాడట. నిన్నటికి నిన్న మంత్రి గంటా శ్రీనివాసరావు రెచ్చిపోయి మరీ కేంద్రప్రభుత్వంపై విమర్శలు చేయడానికి కారణం ఇదే అన్న గుసగుసలు టిడిపి నుంచే వినిపిస్తున్నాయి. మొత్తానికి 2019లో చంద్రబాబు గెలిచే అవకాశమే లేదని భావించిన నాయకులు అందరూ వైకాపాలో చేరిపోతున్నారు. ఇక చంద్రబాబు నమ్ముకున్న ఐఎఎస్ ఆఫీసర్స్ కూడా ఇప్పుడు బాబుకు వ్యతిరేకంగా చంద్రబాబు అండ్ కో అక్రమ వ్యవహారాలను, అవినీతి విషయాలను కేంద్రానికి చేరవేసే పనిలో పడ్డారు. అందుకే ఇప్పుడు చంద్రబాబుతో సహా టిడిపి సీనియర్ నేతలు అందరూ కూడా తీవ్రస్థాయిలో ఆందోళన చెందుతున్నారు. ఆ విషయం మీడియా ముందుకు వచ్చినప్పుడు టిడిపి నేతల హావభావాలే పట్టిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో ముందు ముందు పరిణామాలు ఇంకా ఎలా ఉంటాయో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -